![Nirama Sitharaman](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/31/uGFRbfKWOmwDGzYTMwhm.jpg)
Nirama Sitharaman
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. 2019లో ఆర్థిక మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా తాత్కాలిక బడ్జెట్‌లతో కలిపి ఏడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. రేపు ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో అత్యధికంగా 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నేతగా మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ అప్పట్లో రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 9 బడ్జెట్లతో మాజీ మంత్రి చిందంబరం రెండోస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత నిర్మలా సీతారమన్ ఎనిమిది బడ్జెట్‌లతో మూడో స్థానంలోకి చేరనున్నారు. మాజీ రాష్టపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఎనిమిది సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఇప్పటికే మూడో స్థానంలో ఉన్నారు.
Also Read: రాష్ట్రపతి అలసిపోయారన్న సోనియా గాంధీ.. బీజేపీ ఫైర్
నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్‌లో పారిశ్రామిక రంగానికి సంబంధించి పన్నుల్లో పలు కీలకమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. అప్పటికే దేశంలో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ఆర్థికమంత్రి కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించేశారు. అలాగే 2020లో పాత ఆదాయపు పన్ను విధానంలో సంక్లిష్టతలను తొలగిస్తూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో తక్కువ పన్ను రేట్లను ఇచ్చారు. అలాగే పాత, కొత్త విధానాల్లో ఒక దాన్ని ఎంపిక చేసుకునేలా పన్ను చెల్లింపుదారులకు ఛాన్స్ ఇచ్చారు.
నిర్మలా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి, స్టార్టప్‌లపైనే ఎక్కువగా దృష్టి సారించారు. గత బడ్జెట్‌లో ఆమె ప్రసంగాలు వింటే అర్థమవుతుంది. MSMEలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని పొడిగించారు. అలాగే ఇతర మార్గాల్లో వాటికి రుణాలు అందించేలా నిధులు కేటాయించారు. దీనివల్ల చిన్న సంస్థలకు తక్కువ ధరలకే రుణాలు వచ్చాయి.
Also Read: వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2025-26 GDP గ్రోత్ రేట్ ఎంతంటే..?
గతంలో చూసుకుంటే కంపెనీ చట్టంలో కొన్ని నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. అయితే 2021-22 బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ వీటిని డీక్రిమినలైజ్ అంటే నేర రహితంగా చేశారు. దీనివల్ల దేశంలోని వ్యాపారులకు ఇది అనుకూలంగా మారింది. చిన్న ఉల్లంఘనలు జరిగితే నేరాల నుంచి వాటిని తొలగించారు. అలాగే అనుకోకుండా జరిగే లోపాలకు సంబంధించిన విషయాల్లో కూడా వ్యాపారులకు కూడా ఊరట కల్పించారు. కొన్ని రకాల వాటికి సివిల్ పెనాల్టీని అమలు చేశారు. కంపెనీలు, సంస్థలు, న్యాయ సంబంధ ఇబ్బందులపై కాకుండా.. పురోగతిపై దృష్టిసారించేలా ఈ నిర్ణయం ఉపయోగపడింది.