Liquor Case: లిక్కర్ కేసులో క్లీన్‌చీట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు బిగ్ రిలీఫ్‌ లభించింది. ఈ కేసులో వాళ్లపై నమోదైన అభియోగాలను రౌస్ అవెన్సూ కోట్టివేసింది.

New Update
Kejriwal

Kejriwal

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(delhi-liquor-case) లో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(arvind-kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(kavitha) కు బిగ్ రిలీఫ్‌ లభించింది. ఈ కేసులో వాళ్లపై నమోదైన అభియోగాలను రౌస్ అవెన్సూ కోట్టివేసింది. సరైన ఆధారాలు లేకుండానే వీళ్లను ఈ కేసులో చేర్చారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 23 మందికి విముక్తి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందన్నారు. 

Also Read: NCERT బుక్‌లో న్యాయ వ్యవస్థపై వివాదం.. కేంద్రం కీలక ప్రకటన

Kejriwal - Sisodia - Kavita Responds On Liquor Case

భారత న్యాయవ్యవస్థపై తమకు పూర్తిగా నమ్మకం ఉందని.. మోదీ, అమిత్ షా కలిసి ఆప్‌ను అంతం చేసేందుకు రాజకీయ కుట్రకు పాల్పడినట్లు విమర్శించారు. తాను అవినీతిపరుడిని కాదని.. ఇప్పుడు కోర్టు కూడా ఇదే చెప్పిందని స్పష్టం చేశారు. మరోవైపు మనీశ్ సిసోడియా కూడా కోర్టు తీర్పును స్వాగతించారు. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుందని అన్నారు. కేజ్రీవాల్‌ను, తనను అవినీతిపరులని నిరూపించేందుకు బీజేపీ, దర్యాప్తు సంస్థలు అనేక ప్రయత్నాలు చేశాయంటూ ఆరోపణలు చేశారు. తమ నిజాయతీ ఇప్పుడు నిరూపితమైందని తెలిపారు. 

Also Read: ఒకప్పుడు మిత్రులు, ఇప్పుడు శత్రువులు.. పాకిస్థాన్, అఫ్గాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు కారణాలు ఇవే !

జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కూడా దీనిపై స్పందించారు. నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ముందునుంచే చెబుతున్నానని ఇప్పుడు అలాగే వచ్చానని తెలిపారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని చాలాసార్లు చెప్పానని.. ఇప్పుడు అదే నిజమైందన్నారు. విపక్ష పార్టీలకు వేధించేందుకు దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని విమర్శించారు. కోర్టు తీర్పు రాకుండానే తనపై కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. తనకు కష్ట సమయంలో నిలిచిన వాళ్లందరికీ ధన్యవాదాలని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు