/rtv/media/media_files/2025/02/15/t0tSQ8N1ua89No2awbbK.jpg)
jayalaliotha asets
Jayalalithaa Assets: ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు(Tamilnadu) దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరులోని కోర్టు(Benguluru Court) అధికారులు శుక్రవారం అప్పగించారు. బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు, పత్రాలను భద్రపరిచారు.
10,000 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు,27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు,601 కిలోల వెండి వస్తువులు, 1672 ఎకరాల వ్యవసాయ భూములు పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తదితరాలను తీసుకు వెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చారు.
తమిళనాడు నుంచి కర్ణాటకకు...
న్యాయమూర్తి హెచ్‌ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004 లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు,పత్రాలు ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు.మరో వైపు తాము జయలలితకు వారసులమని, ఆ ఆస్తులను తమకే అప్పగించాలని దీపక్,దీప అనే వ్యక్తులు వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు ఇది వరకే కొట్టివేసింది.
దాన్ని సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ నూ అక్కడి ధర్మాసనం తోసిపుచ్చింది. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువను 913.14 కోట్లుగా అధికారులు మదింపు వేయగా..అది నేడు కనీసం రూ.4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది.