/rtv/media/media_files/2025/03/19/9uAudlvMod8ACk7chFn7.jpg)
isro chairman Photograph: (isro chairman)
నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ రాక అమెరికన్స్‌తోపాటు భారతీయుల్లోనూ ఆనందాన్ని నింపింది. 9 నెలల తర్వాత భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ స్పేస్ స్టేషన్ నుంచి భూమి మీదరకు ఇవాళ చేరుకున్నారు. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చైర్మెన్ వీ నారాయణన్ స్పందించారు. అంతరిక్ష పరిశోధనల్లో సునీతా విలియమ్స్ అనుభవాన్ని వినియోగించుకోనున్నట్లు ఇస్రో చైర్మెన్ వెల్లడించారు.
Also read: Nagpur violence : హింసకు కారణమైన ప్రధాన నిందితుడు అరెస్ట్
సురక్షితంగా నేలపై దిగిన సునీతాకు ఆయన వెల్కమ్ పలికారు. ఇదో అసాధారణ అచీవ్‌మెంట్ అన్నారు. నాసా, స్సేస్ఎక్స్ పనితీరుకు ఇదో సవాల్ అని పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలపై కట్టుబడి ఉన్న అమెరికా కమిట్‌మెంట్‌కు ఇదో పరీక్షలాంటిందన్నారు. ఇస్రోకు చెందిన ఎక్స్ అకౌంట్‌లో నారాయణన్ స్పందించారు.
🚀 Welcome back, Sunita Williams! 🌍
— ISRO (@isro) March 19, 2025
Your safe return after an extended mission aboard the ISS is a remarkable achievement. A testament to NASA, SpaceX, and the USA’s commitment to space exploration! Your resilience and dedication continue to inspire space enthusiasts around the…
భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సునీత విలియమ్స్ రాకపై స్పందించారు. ఈ మేరకు సునీత బృందానికి వెల్‌కమ్ చెబుతూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వెల్ కమ్ బ్యాక్.. క్రూ9..! భూమి మిమ్మల్ని మిస్ అయిందని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. మీ అపరిమిత ధైర్యం, స్ఫూర్తికి ఇన్నాళ్లూ పరీక్ష ఎదురైంది. సునీతా విలియమ్స్, క్రూ9 వ్యోమగాములు మరోసారి వారి పట్టుదల ఏంటో అందరికీ చూపించారు. క్లిష్టమైన, అనిశ్చిత పరిస్థితుల్లో అచంచలమైన సంకల్పంతో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. లక్షల మందిలో స్ఫూర్తి నింపారని ట్విట్‌లో రాసుకొచ్చారు.
Also read: Sunita Williams : గుజరాత్‌లో సునీతా విలియమ్స్ బావ యజ్ఞం
Welcome back, #Crew9! The Earth missed you.
— Narendra Modi (@narendramodi) March 19, 2025
Theirs has been a test of grit, courage and the boundless human spirit. Sunita Williams and the #Crew9 astronauts have once again shown us what perseverance truly means. Their unwavering determination in the face of the vast unknown… pic.twitter.com/FkgagekJ7C