కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) 12 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు పన్ను కట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. మరోవైపు రూ.0 నుంచి 4 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు 0 శాతం పన్ను, రూ.4 నుంచి 8 లక్షల ఆదాయం ఉన్నవారు 5 శాతం పన్ను అని ట్యాక్స్ శ్లాబులో ఉంది. అయితే దీనిపై చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వాస్తవానికి ఇది అంటే.. 12 లక్షల కన్నా ఎక్కువ ఆదాయం ఉంటే ఆ మొత్తాన్ని శ్లాబులు (Slabs) గా విభజించి పన్నును లెక్కిస్తారు. ఉదాహరణకు మీ వార్షిక ఆదాయం 20 లక్షలు అనుకోండి. ఇందులో స్టాండర్ట్ డిడక్షన్ రూ.75 వేలు ఉంటుంది. అంటే మిగిలిన 19.25 లక్షలపై పన్ను ఉంటుంది.
Also Read: ఉడాన్ స్కీమ్‌తో 4 కోట్ల మందికి లబ్ధి.. అసలు ఈ స్కీమ్ ఏంటో తెలుసా?
Also Read : కొత్త పన్నుతో ఎవరెవరికి ఎంత డబ్బు ఆదా అవుతుందో తెలుసుకోండి!
ఇక ట్యాక్స్ శ్లాబులు చూస్తే ఇలా ఉన్నాయి
రూ.0 - 4 లక్షలు - 0 శాతం పన్ను
రూ.4 - 8 లక్షలు - 5 శాతం పన్ను
రూ.8 - 12 లక్షలు - 10 శాతం పన్ను
రూ.12 - 16 లక్షలు - 15 శాతం పన్ను
రూ.16 -20 లక్షలు - 20 శాతం పన్ను
రూ.20 - 24 లక్షలు - 25 శాతం పన్ను
రూ.24 లక్షల పైన - 30 శాతం పన్ను
Also Read: పదివేల మంది విద్యార్థులకు రీసెర్చ్ ఫెలోషిప్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?
Also Read : బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి
కొత్త పన్ను ప్రకటనతో ఇప్పుడు రూ.12 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి రూ.80,000 వరకు మిగిలే ఛాన్స్ ఉంటుంది. అయితే గతంలో కొత్త పన్ను విధానం ప్రకారం రూ.15 లక్షల ఆదాయం దాటినవారు 30 శాతం పన్ను చెల్లించాలి. కానీ ఇప్పుడు రూ.16 నుంచి 20 లక్షలు, రూ.24 లక్షల పైన కొత్త శ్లాబ్‌ను తీసుకొచ్చారు. రూ.24 లక్షల ఆదాయం దాటితేనే 30 శాతం ట్యాక్స్ ఉంటుంది.