Stalin Vs Yogi: హిందీపై యోగి, స్టాలిన్ మధ్య మాటల యుద్ధం.. బ్లాక్‌ కామెడీ అంటూ!

త్రి భాష సూత్రంపై సీఎం స్టాలిన్, యోగి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ఓటు బ్యాంకు కోసమే స్టాలిన్‌ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి అన్నారు. దీంతో యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్‌ బ్లాక్‌ కామెడీలా ఉందంటూ స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.

New Update
hindi war

Hindi language issue CM Stalin strong counter to cm yogi

Stalin Vs Yogi: హిందీ భాష వివాదం మరింత ముదురుతోంది. జాతీయ విద్యా విధానం (NEP)లో భాగమైన త్రిభాషా సూత్రం అంశంలో తమిళనాడు సీఎం స్టాలిన్, యూపీ ముఖ్యమంత్రి యోగి మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి.  ఈ మేరకు ఓటు బ్యాంకు ప్రమాదంలో ఉంది కాబట్టే స్టాలిన్‌ త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తున్నారని యోగి అన్నారు. దీంతో యోగి తమకు పాఠాలు నేర్పడం పొలిటికల్‌ బ్లాక్‌ కామెడీలా ఉందంటూ స్టాలిన్ ఎద్దేవా చేయడం చర్చనీయాంశమైంది. 

ఇదొక పొలిటికల్ డార్క్‌ కామెడీ..

ఈ మేరకు ద్విభాషా విధానం, నియోజకవర్గాల పునర్విభజన, న్యాయమైన, బలమైన స్వరాన్ని తమిళనాడు వినిపిస్తోందని స్టాలిన్ అన్నారు. ఈ కారణంగానే బీజేపీ ఆందోళన చెందుతోందని, దేశ వ్యాప్తంగా బీజేపీ నేతలతో రకరకాలుగా మాట్లాడిస్తోందని మండిపడ్డారు. విద్వేషం గురించి యోగిజీ మాకు పాఠాలు నేర్పాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 'మమ్మల్ని వదిలిపెట్టండి. ఇదొక పొలిటికల్ డార్క్‌ కామెడీ.  మేము ఏ భాషను వ్యతిరేకించట్లేదు. కానీ బలవంతంగా రుద్దితే అసలే అంగీకరించం. మాది న్యాయం కోసమే జరుగుతోన్న పోరాటం' అంటూ స్టాలిన్ యోగికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో మోదీ సర్కార్ తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) విద్యా విధానం కాదని.. బీజేపీ విధానమని అన్నారు. భారత్‌ను అభివృద్ధి పథంలోకి నడిపించాలనే ఉద్దేశం వాళ్లకి లేదని.. దేశవ్యాప్తంగా హిందీని వ్యాప్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.

Also Read: కుక్క కరిచిందని గొంతు కోసుకున్న వ్యక్తి.. ఆపరేషన్ థియేటర్‌లో ఏరులై పారిన నెత్తురు!

అయితే స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు బీజేపీ నేత అన్నమలై ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తోన్న రాజకీయాలు అందరికీ అర్థమవుతున్నాయి. కానీ ఈ విషయాన్ని మీరు గ్రహించకపోవడం దురదృష్టకరం అంటూ విమర్శలు గుప్పించారు.  మరోవైపు మరోవైపు డీఎంకే పార్టీపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతుందని ఆరోపించింది. భాషాపరంగా వివాదాలు సృష్టిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. అలాగే డీలిమిటేషన్‌పై కూడా విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల సౌత్ రాష్ట్రాలకు తక్కువ ఎంపీ సీట్లు వస్తాయని.. నార్త్ రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Also Read: ఢిల్లీలో కారు యాక్సిడెంట్.. కేంద్రమంత్రికి తప్పిన పెను ప్రమాదం!

hindi | bjp | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

మణిపూర్‌లో సైన్యం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అందులో పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారినుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేస్తున్నారు. బిష్ణుపూర్ జిల్లా నింగ్‌థౌఖోంగ్‌, కాక్చింగ్ జిల్లా హియాంగ్లాంలో టెర్రరిస్టులు పట్టుబడ్డారు.

New Update
terrorist arrest

terrorist arrest Photograph: (terrorist arrest)

భద్రతా దళాలు మణిపూర్‌లో వరుసగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాయి. అందులో నిషేధిత తిరుగుబాటు గ్రూపులకు చెందిన అనేక మంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అలాగే వారు వద్ద నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌థౌఖోంగ్‌లో ఆదివారం ఓ టెర్రరిస్ట్ గ్రూప్ సభ్యున్ని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ధృవీకరించారు. తిరుగుబాటు కార్యకలాపాలలో పాల్గొన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాక్చింగ్ జిల్లాలోని హియాంగ్లాంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించి యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్ సభ్యుడిని అరెస్టు చేశాయి.

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Also read: Rameswaram: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

బిష్ణుపూర్ జిల్లాలోని లైషోయ్ హిల్స్ ప్రాంతంలో జరిగిన సోదాల్లో భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఒక SLR రైఫిల్‌తో కూడిన మ్యాగజైన్, ఒక కార్బైన్ మెషిన్ గన్, ఒక .303 రైఫిల్, ఒక డబుల్ బ్యారెల్ గన్, 48 రౌండ్ల మందుగుండు సామగ్రి, 2 గ్రెనేడ్లు, 2 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇతర వస్తువులు ఉన్నాయి. శనివారం జిరిబామ్ జిల్లాలో జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పోలీసులు భారీగా గన్స్ గుర్తించారు. శుక్రవారం తెల్లవారుజామున, బిష్ణుపూర్, తౌబాల్ మరియు తూర్పు ఇంఫాల్ సహా వివిధ జిల్లాల నుండి 2 నిషేధిత సంస్థలు- యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF), కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (PWG)లకు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు పట్టుకున్నాయి.

Advertisment
Advertisment
Advertisment