Delhi Railway station :  ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన  ఢిల్లీ రైల్వే స్టేషన్‌!

ఢిల్లీ రైల్వే స్టేషన్‌ లో 12,13 ప్లాట్‌ఫాం లపై తీవ్రమైన రద్దీ ఏర్పడింది.ఒకేసారి ఐదు రైళ్లు ఆలస్యం కావడంతో వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులు ఆ రెండు ప్లాట్‌ఫాం ల పైకి భారీగా చేరుకున్నారు.దీంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.

New Update
trains

trains

పలు రైళ్ల ఆలస్యంతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌ లో ఆదివారం రాత్రి ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.12,13 ప్లాట్‌ఫాం లపై తీవ్రమైన రద్దీ ఏర్పడింది.దీంతో ఒకానొక సమయంలో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది. తొక్కిసలాట చోటు చేసుకునే అవకాశం ఉండడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

Also Read: Double Murder: కానిస్టేబుల్ భార్యతో అక్రమ సంబంధం.. ప్రియుడిని ఇంటికి పిలిచి భర్త ఏ చేశాడంటే!

ఆ రెండు ప్లాట్‌ఫాంల పైకి ప్రయాణికులు రాకుండా కట్టడి చేశారు.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.దీని పై రైల్వే మంత్రిత్వ శాఖ సైతం స్పందించింది.భారీగా ప్రయాణికులు వచ్చినప్పటికీ ఎలాంటి తొక్కిసలాటగానీ, అలాంటి పరిస్థితి తలెత్తలేదని పేర్కొంది.

Also Read: 🔴Live News Updates: కేసీఆర్కు దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్‌ ప్రెస్‌ ఉంది.. బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

గంగా,స్వతంత్ర సేనాని, జమ్మూ రాజధాని,లఖ్‌నవూ మెయిల్‌,మగధ్ ఎక్స్‌ప్రెస్‌ లు ఢిల్లీ రైల్వే స్టేషన్‌ కు రావడానికి ఆలస్యమయ్యాయి.ఒకేసారి ఐదు రైళ్లు ఆలస్యం కావడంతో వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులు ఆ రెండు ప్లాట్‌ఫాం ల పైకి భారీగా చేరుకున్నారు.దీంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.

వెంటనే రద్దీ నియంత్రన చర్యలు తీసుకున్నారు. తీవ్రమైన రద్దీతో భయాందోళనలు చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గత నెల15 న ఢిల్లీ రైల్వే స్టేష్‌ లోనే తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.కుంభమేళాకు వెళ్లే భక్తులు భారీగా పోటెత్తడంతో మొత్తం 18 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.ఈ నేపథ్యంలో మళ్లీ అలాంటి పరిస్థతి తలెత్తకుండా అధికారులు ముందే అప్రమత్తమయ్యారు.రద్దీని నియంత్రిచడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Also Read:Tirumala Darshan: తిరుమల భక్తులకు గుడ్‌ న్యూస్... ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల..ఎప్పుడంటే

Also Read:YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్‌...వారి మరణాల పై విచారణ!

delhi | railway-station | rush | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates | Delhi railway station 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tractor accident: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

వ్యవసాయ కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బావిలో పడింది. ఏడుగురు మహిళలు మృతి చెందగా.. ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ విషాదం శుక్రవారం జరిగింది. మృతుల కుటుంబాలకు CM రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

New Update
tractor accident in MH

tractor accident in MH

కూలీలు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బావిలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళా కూలీలు మరణించగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అసే గ్రామంలోని వ్యవసాయ క్షేత్రానికి మహిళా కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పింది. అక్కడున్న వ్యవసాయ బావిలో అది పడింది. అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.  

Also read: KCR: సుప్రీం కోర్టు ముందు తెలంగాణ పరువు తీశారు

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటారు పైపులతో నీటిని తోడారు. క్రేన్స్‌ను రప్పించి సహాయక చర్యలు చేపట్టారు. బావిలో పడిన ట్రాక్టర్‌తోపాటు ట్రాలీని బయటకు తీశారు. ఏడుగురు మహిళా కూలీల మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురు మహిళలను రక్షించారు. మరమణించిన ఏడుగురు మహిళలు హింగోలి జిల్లాలోని గుంజ్ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. మహారాష్ట్ర సీఎం కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.

Also read: PM Modi: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు