ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట... రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన కేంద్రం!
ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారత రైల్వే శాఖ రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది