ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట... రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం!

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారత రైల్వే శాఖ రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది

New Update
Delhi Railway station stampede

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు భారత రైల్వే శాఖ ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.  కాగా మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో శనివారం రాత్రి 9:55 గంటల ప్రాంతంలో 14, 15 ప్లాట్‌ఫామ్‌లపై ఈ ఘటన చోటుచేసుకుంది.

 ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోగా..  డజనుకు పైగా మంది గాయపడ్డారు. మృతుల్లో 15 మందిని సెంట్రల్ ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాష్ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు  ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి తెలిపారు. బాధితుల్లో ఇద్దరు తప్ప మిగతా వారందరినీ అధికారులు గుర్తించారు, వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు.  ఈ దుర్ఘటనపై రైల్వే బోర్డు ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించింది.

ఢిల్లీరైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనలో మృతుల వివరాలు

మృతులు: ఆహాదేవి, పింకి దేవి, షీలా దేవి, వ్యోమ్‌,  పూనమ్‌ దేవి, లలితా దేవి, సురుచి, కృష్ణ దేవి, విజయ్, నీరజ్‌, శాంతిదేవి, పూజాకుమార్‌, పూనమ్, సంగీతామాలిక్, మమతాఝా, రియాసింగ్, బేబీకుమారి, మనోజ్ లు మృతి చెందినట్లుగా గుర్తించారు . మృతులంతా బిహార్‌, ఢిల్లీ వాసులుగా గుర్తించారు పోలీసులు.  

రాహుల్‌ దిగ్భ్రాంతి

ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాహుల్‌ సంతాపం తెలిపారు.  రద్దీని నియంత్రించడంలో రైల్వేశాఖ, కేంద్రం విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. ప్రయాగ్‌రాజ్‌ వెళ్లే ప్రయాణికుల కోసం.. మెరుగైన ఏర్పాట్లు చేయాలన్నారు రాహుల్‌గాంధీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.  

Also Read :   TGRTC: మహాశివరాత్రికి వెళ్లే భక్తులకు బంపరాఫర్‌ ఇచ్చిన టీజీ ఆర్టీసీ..780 ప్రత్యేక బస్సులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు