/rtv/media/media_files/2025/02/16/etFqxL8zd3nwE3ceRckr.jpg)
ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మహా కుంభమేళా కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే రైళ్లు ఎక్కడానికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడటంతో శనివారం రాత్రి 9:55 గంటల ప్రాంతంలో 14, 15 ప్లాట్‌ఫామ్‌లపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో చాలామంది తమ ఆప్తులను కోల్పోయారు. మరికొందరు కనిపించకుండా పోయారు. సొంతకుటుంబ సభ్యులు కనిపించకుండా పోవడంతో వారి బాధలు వర్ణాణతీతం అనే చెప్పాలి.
ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలో రైల్వే ప్రమాదాలు పెరిగిపోయాయని, రద్దీకి అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. జనరల్ బోగీల సంఖ్యను చాలా వరకు తగ్గించారని, సాధారణ ప్రయాణికుల కష్టాలను పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు.
@AshwiniVaishnaw no shame at all... #DelhiStampede
— RAVIPRASAD ರವಿಪ್ರಸಾದ್ (@RAVIPRASADM) February 16, 2025
How many lives you need #NarendraModi ji... Please sack this idiot... When 2 trains late... The authority must have been alert when the crowd count increased.#Railway 🤦🏻♂️🤦🏻♂️ https://t.co/iDgNa2QNYK
1956లో అరియలూర్ రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్ట్రీ రాజీనామా చేసినట్లుగా గుర్తుచేస్తున్నారు. ఆయన రాజీనామా లేఖను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు నెటిజన్లు. కాగా 1956లో తమిళనాడులో అరియలూర్ వద్ద మద్రాస్ ట్యూటికోరన్ ఎక్స్ ప్రెస్ కుండపోత వర్షం కారణంగా వంతెన కూలిపోవడంతో నదిలో పడి 156 మంది మరణించగా.. 110 మందికి పైగా గాయపడ్డారు. అప్పటి వరకు ఇది స్వతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన రైలు ప్రమాదం.
43 ఏళ్ల తర్వాత రాజీనామా
43 ఏళ్ల తర్వాత రైల్వే మంత్రి నుండి రెండవ రాజీనామా జరిగింది. 1999 ఆగస్టులోఅస్సాంలో గైసల్ రైలు ప్రమాదంలో దాదాపు 290 మంది ప్రాణాలు కోల్పోయారు. సంఘటన అనంతరం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. 2000 సంవత్సరంలో మమతా బెనర్జీ రెండు రైలు ప్రమాదాల తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
Also Read : Pakistan: పాకిస్తాన్ లో భూకంపం..భారత్ సరిహద్దుల్లో కూడా..