/rtv/media/media_files/2025/03/26/YgWMfDFxHu3WCLzDEFks.jpg)
pf
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక సంస్కరణలు దిశగా అడుగులు వేస్తోంది. ఈపీఎఫ్ నుంచి నిధుల ఉపసంహరణను సులభతరం చేయనుంది.త్వరలో యూపీఐ నగదు విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ప్రతిపాదనలకు కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఆ శాఖ కార్యదర్శి సుమిత్రా దావ్రా తెలిపారు.
Also Read: AP NEWS: షాకింగ్ న్యూస్.. ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్యశ్రీ బంద్.. ఎందుకంటే?
ఈ ఏడాది మే లేదా జూన్ నుంచి ఉద్యోగులు పీఎఫ్ మొత్తాలను ఏటీఎం, యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుందని వెల్లండించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడారు. ప్రావిడెండ్ ఫండ్స్ నిధులు పొందే విషయంలో చందాదారులు అనూహ్య మార్పులు చూడబోతున్నారని తెలిపారు.
కేవలం నగదు విత్ డ్రా మాతరమే కాకుండా..పీఎఫ్ లో ఎంత మొత్తం ఉందో కూడా యూపీఐ ద్వారా చూసుకోవచ్చని తెలిపారు.ఆటోమేటెడ్ సిస్టమ్ విధానంలో లక్ష రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పారు. కోరుకున్న అకౌంట్‌కు ఆ నగదును బదిలీ చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిజిటలైజ్ చేయడంలో ఈపీఎఫ్‌ఓ గణనీయమైన పురోగతి సాధించిందని దావ్రా పేర్కొన్నారు.
విత్ డ్రా సదుపాయాన్ని క్రమబద్దీకరించడానికి120కి పైగా డేటా బేస్ లను ఏకీకృతం చేసిందని తెలిపారు. అంతేకాకుండా క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం కూడా కేవలం 3రోజులకు తగ్గిందని చెప్పారు.95 శాతం క్లెయిమ్ లు ఆటోమేటెడ్ ప్రాసెస్ రూపంలో జరుగుతున్నాయని తెలిపారు. యూపీఐ,ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్ డ్రా ఆప్షన్ అనేది ఒక మైలు రాయి అని, లక్షలాది మంది ఉద్యోగులకు దీని వల్ల ప్రయోజనం కలగనుందని చెప్పారు.
pf | upi | atm | withdraw | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates