Economic Survey 2025: గ్రోత్ రేట్ సరిపోదు..రూల్స్ మరింత ఈజీ చేయాలి..ఆర్ధిక సర్వే

భారతదేశం అభివృద్ధి చెందుతోందని...మూలాలు బలంగా ఉన్నాయని చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే.  దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న గ్రోత్ రేట్ సరిపోదని...దానికి మరిన్ని సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది. 

New Update
Budget 2024: రక్షణ బడ్జెట్ రూ. 6.21 లక్షల కోట్లు

Economic Survey: 2025–26 ఆర్థిక సంవత్సరంలో మనదేశ జీడీపీ గ్రోత్​ 6.3-–6.8 శాతమే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అయితే భారత్ ధనిక దేశం అవ్వడానికి సరి పోదని..రూల్స్ ను మరింత ఈజీ చేయాలని చెప్పింది.  గ్రోత్ పెరగాలంటే భూ, కార్మిక సంస్కరణల ఆవశ్యకత ఉందని ఆర్థిక సర్వే తెలిపింది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలంటే ఎనిమిది శాతం గ్రోత్ కావాలి అని చెప్పింది. ఈరోజు లోక్ సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పలు కీలక అంశాలను ఈ సర్వేలో ప్రస్తావించారు. 

Also Read: చనిపోయిన పేరెంట్స్ కు కుంభమేళాలో స్నానం.. ఆ కూతురు ఏం చేసిందంటే!-VIDEO VIRAL

ప్రజల్లో అవగాహన పెంచాలి.. 

ప్రపంచంతో పోటీ పడాలంటే క్షేత్రస్థాయిలో నిర్మాణాత్మక సంస్కరణలు తేవాలని ఆర్థిక సర్వే చెప్పింది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలని..ప్రస్తుతం ఉన్న చాలా నియంత్రణలు ఎత్తేయాలని అంది. అప్పులు తగ్గి ఆస్తులు పెరగాలి. ప్రైవేట్​కన్సంప్షన్​ , ఎఫ్​డీఐలు కూడా పెరగాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం గ్రోత్ రేట్​ను కేంద్రం 6.4 శాతంగా అంచనా వేసింది. కరోనా తరువాత గ్రోత్​ ఇంత తక్కువగా రావడం ఇదే మొదటిసారి. కానీ రాబోయే పదేళ్ళల్లో ఇది చాలా పెరగాలని చెప్పింది. దీనికి ఈ–కామర్స్ కంపెనీల ద్వారా దేశ ఎగుమతులను పెంచేందుకు అడ్డుగా ఉన్న రూల్స్ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థ రానున్న పదేళ్లలో ఏడాదికి 7–8 శాతం వృద్ధి చెందాలంటే దివాలా పక్రియను మరింత మెరుగుపరచాలి. ఇన్‌‌సాల్వెన్సీ బ్యాంకరప్టసీ కోడ్‌‌ (ఐబీసీ) కింద దివాలా పనులు వేగంగా జరగాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్‌‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ) లేబలింగ్‌‌ రూల్స్‌‌ను కఠినం చేయాలి. అల్ట్రా ప్రాసెస్డ్‌‌ ఫుడ్స్‌‌ (యూపీఎఫ్‌‌ఎస్‌‌) వాడకాన్ని తగ్గించేందుకు జీఎస్‌‌టీ ఎక్కువ వేయాలి. ప్రజల్లో అవగాహన పెంచాలని ఆర్థిక సర్వేలో తేలింది. 

Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్‌ రెబల్‌ స్టార్‌!

దేశంలో పంట మార్పిడి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్పహించాలి. ఇలా చేస్తే దీర్ఘకాలం దేశ ఆహార భద్రతకు భరోసా ఉంటుంది. సహకార రంగాన్ని బలోపేతం చేయాలి. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అండగా నిలవాలి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పల్లెలను మార్కెట్లతో అనుసంధానించాలని ఆర్థిక సర్వే చెప్పింది. దీంతో పాటూ  పునరుత్పాదక ఇంధన వనరులను విస్తరించాలి. సౌర, పవన, గ్రీన్‌ హైడ్రోజన్లపై దృష్టి కేంద్రీకరించాలి. పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్‌ పథకాలతో పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత్సహించాలి.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?

అలాగే  టెక్నాలజీలో ఏఐ, డిజిటల్‌ టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగులు, కార్మికుల నైపుణ్యాలు మెరుగుపడాలి. పని ప్రదేశంలో సంస్కరణలతో శ్రామిక జనాభాలో మహిళల పాత్ర పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య, పరిశోధన, న్యాయ, విద్య, వ్యాపార రంగాల్లో రానున్న రోజుల్లో ఏఐది చాలా కీలక పాత్ర అని..అందుకే దాని మీద అధికంగా దృష్టిని పెట్టాలని ఆర్థిక సర్వే చెప్పింది. దాంతో పాటూ తయారీ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలని, అదే సమయంలో కృత్రిమ మేధ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాలపై భారీగా పెట్టుబడులు పెట్టాలి. శ్రామిక మార్కెట్‌కు ఏఐ అంతరాయం కలిగిస్తుందన్న ఆందోళన అంతటా నెలకొంది. ఈ విషయంలో సంస్థలు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.  ఏఐతో అవకాశాలూ ఉన్నాయి. సవాళ్లూ ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో ఈ సాంకేతికత దుర్వినియోగం కాకుండా నియంత్రణలు విధించాలి. 
ఈ-గవర్నెన్స్‌ను, యూపీఐ, ఆధార్‌ తదితర డిజిటల్‌ మౌలిక వసతులను బలోపేతం చేయాలి. 5జీ నెట్‌వర్క్‌ను విస్తరించాలి. ఇందుకు ఏఐ, డేటా ఆధారిత విధాన నిర్ణయాలు తీసుకోవాలి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు.

New Update
P. chidambaram

P. chidambaram

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత చిదంబరం మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. సబర్మతి ఆశ్రమంలో ఆయన ఓ కార్యక్రమానికి హాజరైయ్యారు. ఎండతీవ్రత కారణంగా అకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. అక్కడనే ఉన్న కార్యకర్తలంతా ఆయనను ఆసుప్రతికి తరలించారు.

Also read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

హాస్పిటల్‌లో చేర్పించి అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అలసట, వేడి కారణంగా ఆయనకు తల తిరుగుతున్నట్లు అనిపించిందని.. ఆ తర్వాత స్పృహ కోల్పోయినట్లుగా పేర్కొన్నాయి. 

Advertisment
Advertisment
Advertisment