/rtv/media/media_files/2025/02/24/5bMcVhf1Cw7yn9jnDU3h.jpg)
DMK blackens Hindi signs in Tamil Nadu, Annamalai calls them 'confused nincompoops'
తమిళనాడులో హిందీ భాషపై వివాదం నడుస్తోంది. జాతీయ విద్యా విధానం ద్వారా బలవంతంగా హిందీని రుద్దుతున్నారని సీఎం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కేంద్రం రూ.10 వేలు కోట్లు ఇచ్చినా ఈ విద్యా విధానాన్ని అమలు చేయమని ఆయన స్పష్టం చేశారు. దీంతో అధికార డీఎంకే కార్యకర్తలు పలు బోర్డులపై ఉన్న హిందీ పేర్లకు నల్ల రంగం పూయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైల్వేస్టేషన్లు, పోస్టాఫీసులతో పాటు వివిధ చోట్ల ఉన్న ప్రభుత్వ సైన్ బోర్డులపై హిందీ అక్షరాలపై నల్లరంగు పూస్తున్నారు.
Also Read: అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు తొలగింపు.. ఢిల్లీ అసెంబ్లీలో తొలిరోజు రచ్చ రచ్చ!
ఆదివారం డీఎంకే శ్రేణులు పాలైయంకోట్టై, పాలక్కాడ్ రైల్వే స్టేషన్‌లోని బోర్డులపై హిందీ పేర్లకు నల్ల రంగు వేశారు. సోమవారం కూడా దీన్ని పలు చోట్ల కొనసాగించారు. చెన్నైలోని అలందూర్ పోస్టాఫీస్, అలాగే జీఎస్టీ రోడ్డులో ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలోని హిందీ అక్షరాలతో ఉన్న సైన్ బోర్డులపై బ్లాక్ పెయింట్ వేశారు. అయితే హిందీ భాషను వ్యతిరేకిస్తున్న డీఎంకేపై బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై మండిపడ్డారు.
Also Read: రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్ !
త్రిభాషా విధానంపై డీఎంకే పార్టీ కపటత్వం చూపిస్తోందంటూ తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతల సొంత పిల్లలు బహు భాషా పాఠశాలల్లో చదువుకున్నప్పుడు త్రిభాషా విధానాన్ని డీఎంకే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నలు గుప్పించారు. డీఎంకే అనేది వాళ్ల కుటుంబాలకు, ఇతరులకు భిన్నమైన ప్రమాణాలు పాటించే అవివేకుల సమూహం అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలను డీఎంకే తప్పు దారి పట్టిస్తోందని విమర్శించారు.
Had seen a few misguided individuals roaming around with a can of black paint, striking Hindi Letters in opposition to the three-language formula in the New National Education Policy. We would humbly suggest that they visit the Enforcement Directorate and Income Tax Office with…
— K.Annamalai (@annamalai_k) February 24, 2025