/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/kavitha-kejriwal.jpg)
Delhi liquor policy case
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. 166 పేజీలతో కూడిన కాగ్ రిపోర్ట్ నివేదికలను ఢిల్లీ సీఎం రేఖాగుప్తా అసెంబ్లీకి సమర్పించారు. దీంతో మరోసారి కవితను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుండగా తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపణలు మొదలయ్యాయి. అంతేకాదు 2021 -22లో తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీతో ఢిల్లీ ప్రభుత్వానికి రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు రేఖాగుప్తా బయటపెట్టడం సంచలనం రేపుతోంది.
రూ.2002.68 కోట్ల మేర నష్టం..
ఈ మేరకు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం సీఎం రేఖాగుప్తా కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లిక్కర్ స్కామ్‌తో ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2002.68 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కంపోట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) స్పష్టం చేసిందని తెలిపారు. ఆప్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించి కాగ్ 20 అంశాలను లేవనెత్తింది. వాటిల్లో మద్యం విధానం-2021తో నష్టాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అయితే దీనిని ఆప్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. సభలో ఆందోళన చేపట్టడంతో 21 మంది ఆప్ ఎమ్మెల్యేలు స్పీకర్ విజేంద్రగుప్తా 2 రోజులపాటు సస్పెండ్ చేశారు.
Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?
కొవిడ్ లాక్ డౌన్ ల పేరుతో మరింత..
2021 మద్యంపాలసీతో ప్రభుత్వానికి చాలా నష్టం వాటిల్లింది. సరెండర్ చేసిన రిటైల్ లైసెన్స్‌ల ప్లేసులో మళ్లీ టెండర్లను ఆహ్వానించలేదు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.890.15 కోట్ల నష్టం వచ్చింది. జోనల్ లైసెన్సుల మినహాయింపు వల్ల మరో రూ.941.53 కోట్లు నష్టం వాటిల్లింది. రూ.27 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్లను సరిగి వసూల్ చేయలేదు. కొవిడ్ లాక్ డౌన్ ల పేరుతో ఇంకో రూ.144 కోట్లు నష్టం. మొత్తం 2002.68 కోట్లు ప్రభుత్వానికి నష్టవాటిల్లినట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!