National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

బీజేపీ ప్రభుత్వంపై సీపీఎం తన వైఖరిని మార్చుకుంది. మోదీని, బీజేపీ మాతృసంస్థ RSSను నియో-ఫాసిస్టుగా పరిగణించట్లేదని ప్రకటించింది. వామపక్ష పార్టీలకు భిన్నంగా ప్రకటన చేయడంపై సీపీఐ, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం స్వాగతించింది.

New Update
cpm bjp

CPM declares not consider neo-fascists Modi, BJP, RSS

National: బీజేపీ ప్రభుత్వంపై సీపీఎం తన వైఖరిని మార్చుకుంది. మోదీ ప్రభుత్వం నిరంకుశత్వ జాతీయవాద శక్తి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడే సీపీఎం.. ఇప్పుడు తన వాయిస్ భిన్నంగా వినిపిస్తోంది. మోదీ ప్రభుత్వంపై ఫాసిస్టు ముద్ర వేసేందుకు నిరాకరించడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వామపక్ష పార్టీలకు భిన్నంగా మోదీ ప్రభుత్వంపై సీపీఎం చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

ఫాసిస్టుగా పరిగణించలేం..

మోదీని, బీజేపీ మాతృసంస్థ RSSను నియో-ఫాసిస్టుగా పరిగణించట్లేదని ప్రకటించింది. మోదీ సర్కార్‌కు నయా-ఫాసిస్టు పోకడలు ఉన్నాయని పార్టీ ముసాయిదా తీర్మానంలో అంగీకరిస్తూనే.. ఫాసిస్టు ప్రభుత్వమని మాత్రం పరిగణించలేమని తేల్చేసింది. బీజేపీ పదేళ్ల నిరంతర పాలన తర్వాత, బీజేపీ-RSS చేతుల్లో రాజకీయ అధికారం ఏకీకృతం అయిందని మాత్రమే చెబుతోంది. దీని ఫలితంగా బీజేపీలో నియో-ఫాసిస్ట్ లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని సీపీఎం అంటోంది.  

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

రహస్య స్నేహం బట్టబయలు..

సీపీఎం ప్రకటనపై సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మార్క్సిస్ట్ పార్టీ ఏళ్ల తరబడి బీజేపీతో సాగిస్తున్న రహస్య స్నేహం బట్టబయలైందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేరళ ఎన్నికల వేళ బీజేపీతో సీపీఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందని మండిపడింది. అటు సీపీఎం తన తీర్మానాన్ని సవరించుకోవాలని సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి వినయ్‌ విశ్వం డిమాండ్‌ చేశారు. ఫాసిస్ట్‌ భావజాలం, మతం, విశ్వాసాన్ని రాజకీయ లాభం కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు చెబుతుందని.. బీజేపీ ప్రభుత్వం వీటన్నింటినీ ఆచరణలో పెట్టిందని మండిపడ్డారు.  

ఇది కూడా చదవండి: నాగబాబు ఫిక్స్.. వర్మకు డౌట్.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే! !

మరోవైపు తమిళనాడులోని మదురైలో ఏప్రిల్‌ 24న సీపీఎం పార్టీ, కాంగ్రెస్‌  సంయుక్త సమావేశం జరుగనుంది. ఈ సమావేశాల్లో ఆమోదించే విశ్లేషణాత్మక రాజకీయ తీర్మానం ముసాయిదాను.. కేంద్ర కమిటీ ఇటీవలే రాష్ట్ర కమిటీలకు చర్చ కోసం పంపింది. మోదీ సర్కార్‌ను సీపీఐ ఫాసిస్టు ప్రభుత్వంగా పేర్కొనకపోవడంతో భారత్‌లోకి ఫాసిజం వచ్చేసిందని సీపీఐ-ఎంఎల్‌ అంటోంది. అయితే ఈ రెండు పార్టీలకు తన వైఖరి భిన్నమని సీపీఎం తన ముసాయిదాలో పేర్కొంది. ఇక సీపీఎం ప్రకటనను బీజేపీ స్వాగతించింది. ఈ ప్రకటనతో కాంగ్రెస్‌ కుట్రలు కనుమరుగవ్వనున్నాయని చెప్పింది. సీపీఎం ఆలస్యంగానైనా నిజాన్ని గ్రహించిందని సంతోషం వ్యక్తం చేసింది బీజేపీ. గతంలో బీజేపీని ఫాసిస్ట్‌గా వర్ణించిన సీపీఎం.. ఇప్పుడు అలా చెప్పలేమంటూ అనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇది కూడా చదవండి: మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral News: పాపం.. అందర్నీ నవ్విస్తూనే కుప్పకూలి చనిపోయింది!

మహారాష్ట్రలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫేర్‌వెల్ పార్టీలో విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

New Update
Maharashtra farewell part girl died with heart attack

Maharashtra farewell part girl died with heart attack

Viral News:  కేరింతలు,డాన్సులు, నవ్వులతో సందడిగా ఉండాల్సిన ఫెర్వేల్ పార్టీలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వేదికపై ఎంతో సంతోషంగా ప్రసంగిస్తున్న విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్రలో జరిగింది. అసలు ఆఅమ్మాయికి ఏం జరిగిందో తెలియాలంటే ఇక్కడ చదవండి. 

Also Read: Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి

ఫేర్‌వెల్ పార్టీలో వీడ్కోలు 

మహారాష్ట్రలోని ధారశివ్ జిల్లాలో పరండా పట్టణంలోని పరండా ఆరాజి షిండే కాలేజీలో ఫేర్‌వెల్ పార్టీ జరిగింది. అయితే వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా BSC ఫైనల్ ఇయర్ విద్యార్థిని వర్ష ఖరత్ వేదికపై ప్రసంగించింది. కాలేజీలో తన అనుభవాలను, స్నేహితులతో గడిపిన జ్ఞాపకాలను చెబుతూ అందరినీ ఉత్సాహపరిచింది. అప్పటివరకూ అందరినీ నవ్విస్తూ,ఎంతో యాక్టీవ్ గా కనిపించిన వర్ష ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి  తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.  అయితే వర్షకు ఎనిమిదేళ్ల వయసులో హార్ట్ సర్జరీ అయినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత గత 12 ఏళ్లగా ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు గుండె పగిలేలా ఏడుస్తున్నారు. మరోవైపు తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 

telugu-news | latest-news 

Also Read: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి' ట్రైలర్! నవ్వులే నవ్వులు

Advertisment
Advertisment
Advertisment