/rtv/media/media_files/2025/02/22/JgrfdRDP4dFBlRnQPh7B.jpg)
Chhattisgarh Police seize huge Maoist dump
Maoist: మావోయిస్టులకు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఛత్తీష్ గఢ్‌లో భారీ డంప్ స్వాధీనం చేసుకున్నారు. సుక్మా అడవులలో కూంబింగ్ నిర్వహిస్తున్న 203 కోబ్రా, 131 CRPF జవాన్లు ఆయుధాలతో పాటు పార్టీ కీలక సమాచారం కలిగిన 15 డైరీలు దొరికాయి.
చింతవాగులో మావోయిస్టుల డంప్..
ఈ మేరకు గుర్రాజ్ గుడాం, పెడచంద మధ్యగల అటవీ ప్రాంతంలోని చింతవాగుకు సమీపంలో మావోయిస్టుల డంప్ కనుగొన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఇందులో అత్యధిక సామర్థ్యం కలిగిన టెలిస్కోప్ లు, ఆయుధాలు, మెడిసిన్స్, విప్లవ సాహిత్యంతోపాటు అత్యంత కీలకమైన డైరీలు లభించినట్లు వెల్లడించారు. డైరీలలో మావోయిస్టుల ప్రణాళికలున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Telangana: ఇద్దరు ఐపీఎస్ అధికారులు రిలీవ్.. జీవో జారీ
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేక పోరాటం, భద్రతా బలగాలను మట్టు పెట్టడానికి ప్లాన్స్, కొత్త రిక్రూట్మెంట్ కు సంబంధించిన ప్రణాళికలు డైరీల్లో ఉన్నట్లు బయటపెట్టారు. అలాగే మావోయిస్టు పార్టీ కోవర్టులకు సంబంధించిన సమాచారం కూడా ఉన్నట్లు చెప్పారు. ఈ డైరీల సమాచారం ఆధారంగా భద్రత బలగాలు తమ ఆపరేషన్ దిశను మార్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కీలక డైరీలు పోలీసుల చేతికి చిక్కడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తప్పదంటున్నారు.
ఇదిలా ఉంటే.. మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ హిడ్మా కూతురు వంజెం కేషా(Vanjem Kesha) పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఆమెపై రూ.4 లక్షల రివార్డు ఉన్నట్లు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) తెలిపారు. ఇక చిన్నతనం నుంచే చైతన్య నాట్యమండలి(Chaitanya Natyamandali)లో పని చేసిన వంజెం కేషా.. 2021లో గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలిగా నియామకం అయింది. ఆ తర్వాత కొంతకాలానికి దళంలోనే రమేష్‌ను పెళ్లి చేసుకుంది.