/rtv/media/media_files/2024/10/26/SSGwrpMDUJlyn06WfyQG.jpg)
DA Hike: కేంద్ర ఉద్యోగుల మళ్ళీ డీఏ పెరిగింది. ఈరోజు ప్రధాని మోడీ(PM Modi) నేతృత్వంతో జరిగిన కేబినెట్ లో దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. డియర్ నెస్ అలవెన్సు ను రెండు శాతం పెంచినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. జనవరి 1 నుంచి పెరిగిన డీఏ వర్తిస్తుందని చెప్పారు. సవరణ తర్వాత డీఏ మొత్తం బేసిక్ జీతంలో 53 శాతం నుంచి 55 వరకు పెరుగుతుందని ఆయన వివరించారు. దీని బట్టి ఉద్యోగుల జీతం కూడా పెరగనుంది. డీఏ పెంపుతో 48.66 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
గతేడాది జూలైలో చివరి సారి డీఐను పెంచింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు కూడా దీనని 50 నుంచి 53 శాతానికి పెంచింది. ఏడాదికి రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల డీఏను సవరిస్తుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ అందజేస్తారు. నిజానికి పదేళ్ళకొకసారి ఉద్యోగుల బేసిస్ వేతనాన్ని పెంచుతుంది పే కమిషన్. దీనికి సంబంధించి అన్నీ నిర్ణయాలు పే కమిషనే తీసుకుంటుంది. అయితే ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా కేవలం డీఏ మాత్రమే ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వమే సవరిస్తుంది. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమలులో ఉండగా.. కొన్ని రోజుల కిందట ప్రధాని మోదీ 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: భార్య అలా బెదిరించినా విడాకులు తీసుకోవచ్చు: హైకోర్టు
దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ...
మరోవైపు పీఎల్ఐ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇది పెద్ద పీట వేయనుంది. దిగుమతులు తగ్గించి స్వదేశీ ఎలక్ట్రానిక్స్ సరఫరాను పెంచేందుకు లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. దేశీయంగా తయారు చేసే బ్యాటరీలు, డిస్ ప్లేలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కెమెరా మాడ్యుల్స్ లాంటి కీలకమైన ఎలక్ట్రానిక్ భాగాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా కేంద్రం చర్యలను తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 40వేల కోట్లు పెట్టుబడులు ఆకర్షించడం, రాబోయే ఐదేళ్లలో 5060 బిలియన్ల డాలర్ల ఉత్పత్తినిపెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం ప్రారంభ వ్యయాన్ని రూ.25వేల కోట్లుగా నిర్ణయించింది. తర్వాత వస్తువుల తయారీ, డిమాండ్ ఆధారంగా దీన్ని మరింత పెంచనుంది.
Also Read: BIG BREAKING: అన్నంలో విషం కలిపిపెట్టిన తల్లి.. నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి
today-latest-news-in-telugu | central | employees | da | cabinet