BSNL: ధమాకా ఆఫర్.. రూపాయికే నెలంతా అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా!

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టి సూపర్ హిట్ అయిన ‘బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ ప్లాన్’ను సంస్థ పునరుద్ధరించింది.

New Update
bsnl

టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టి సూపర్ హిట్ అయిన ‘బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీడమ్ ప్లాన్’(BSNL New Recharge Plan) ను సంస్థ పునరుద్ధరించింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు కనీవినీ ఎరుగని రీతిలో కేవలం ఒక్క రూపాయికే నెల రోజుల పాటు అపరిమిత సేవలను పొందవచ్చు.

Also Read :  ప్రపంచ రికార్డు.. 864 గంటల పాటు చీకట్లో ఇరాన్ ఇంటర్‌నెట్ లోకం!

రూ.1 ప్లాన్ విశేషాలు ఇవే..
సాధారణంగా ప్రైవేట్ నెట్‌వర్క్‌లలో నెలకు రూ.200 నుండి రూ.300 వరకు ఖర్చయ్యే సేవలను BSNL Bumper Offer కేవలం రూ.1కే అందిస్తుండటం విశేషం. ఈ ప్లాన్ కింద లభించే ప్రయోజనాలు:

వ్యాలిడిటీ: 30 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.
వాయిస్ కాల్స్: దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ మాట్లాడుకోవచ్చు.
డేటా: ప్రతిరోజూ 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే నెలకు మొత్తం 60జీబీ డేటా అన్నమాట.
ఎస్సెమ్మెస్‌లు: రోజుకు 100 ఉచిత SMS పంపుకోవచ్చు.
ఉచిత సిమ్: ఈ ఆఫర్‌లో భాగంగా కొత్త వినియోగదారులకు సిమ్ కార్డును కూడా పూర్తిగా ఉచితంగానే అందజేస్తున్నారు.

Also Read :  అమెజాన్‌పై ఇరాన్ మిస్సైళ్ల వర్షం.. గల్ఫ్‌లో స్తంభించిన క్లౌడ్ సేవలు!

ఎవరికి వర్తిస్తుంది?

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తమ నెట్‌వర్క్‌లోకి కొత్త కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా బీఎస్‌ఎన్‌ఎల్ తెలంగాణ విభాగం ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా వివరాలను వెల్లడించింది. ఈ ప్రత్యేక 'ఫ్రీడమ్ ప్లాన్' పరిమిత కాల ఆఫర్ మాత్రమే. ఆసక్తి గల వినియోగదారులు ఏప్రిల్ 30, 2026 లోపు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ పొందాలనుకునే వారు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలతో సమీపంలోని బీఎస్‌ఎన్‌ఎల్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా అధీకృత రిటైలర్లను సంప్రదించాలి. అక్కడ కేవలం ఒక రూపాయి చెల్లించి కొత్త సిమ్ తీసుకోవడం ద్వారా 30 రోజుల పాటు ఉచిత సేవలను యాక్టివేట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం మార్కెట్‌లో రీఛార్జ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకొచ్చిన ఈ రూపాయి ప్లాన్ సామాన్యులకు, ముఖ్యంగా విద్యార్థులు మరియు గ్రామీణ ప్రాంత వినియోగదారులకు ఎంతో ఊరటనిస్తుందని టెలికాం నిపుణులు భావిస్తున్నారు. - viral news telugu

Advertisment
తాజా కథనాలు