![delhi](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/02/CjjeoN7Zgl6sPjPa9hK3.jpg)
Budjet, Kejriwal
ఢిల్లీ ఎన్నికల్లో ఎలా అయినా గెలిచి తీరాలని బీజేపీ పట్టుదలగా ఉంది. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు ఉన్నందువలన అక్కడ కోడ్ అమల్లో ఉంది. దాంతో ప్రత్యక్షంగా ఏం చేయలేదు. అందుకే బడ్జెట్ ద్వారా పరోక్షంగా దెబ్బ కొట్టేందుకు వ్యూహం పన్నింది. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీలో ఆప్ చేతిలో పరాజయం పాలైన బీజేపీ మూడోసారి అలా జరగకూడదని గట్టి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే కేంద్ర బడ్జెట్ ను ఆయుధంగా తీసుకుంది అని అంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఆదాయపు పన్ను పరిమితిని 12 లక్షల వరకు పెంచి మాస్టర్ స్ట్రోక్ వేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఢిల్లీ మధ్య తరగతి ప్రజలే లక్ష్యమా?
దేశ రాజధానిలో మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీలో మధ్య తరగతి వర్గం 67 శాతం కంటే ఎక్కువే ఉంది. వారిని ఆకట్టుకుంటే ఎన్నికల్లో గెలవడం ఖాయం. అందుకే వారిని ఆకర్షించేలా పన్నులో రాయితీని ప్రకటించిందని చెప్పుకుంటున్నారు. రూ.12 లక్షల వరకు పన్ను రాయితీ ప్రకటించడం ద్వారా ఆప్ బాస్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ తిరుగులేని అస్త్రాన్ని ప్రయోగించారని అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కేజ్రావాల్...పన్నుల విధానంపై...బీజేపీ మీద ఆరోపణలు చేశారు. పన్ను రాయితీని రూ.10 లక్షలకు పెంచాలని...మధ్య తరగతిని ఏటీఎంగా వాడుకోకూడదంటూ వ్యాఖ్యలు చేశారు. దీనికి బదులుగా ఈ పన్ను రాయితీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆప్ ప్రకటించిన మధ్య తరగతి మ్యానిఫెస్టోకు ఈ ఒక్క దానితో చెక్ పట్టిందని అంటున్నారు. దీంతో కేజ్రీవాల్ కంటే మూడాకులు ఎక్కువే రాజకీయాలు చదివానని బీజేపీ, మోదీ చెప్పకనే చెప్పినట్టయింది.
ఈసారి కేజ్రీవాల్ కు కష్టమే..
మరోవైపు ఈ సారి ఎన్నికల్లో ఆప్, కేజ్రీవాల్ కు ఎదురీత తప్పదని అంటున్నారు. రెండు సార్లు ఆప్ ఢిల్లీలో ఈజీగా గెలిచేసింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కేజ్రీవాల్ తో సహా మరికొంత ముఖ్య నేతలు జైలుకు వెళ్ళి రావడం..ఆప్ మీద అవినీతి మచ్చ పడడం లాంటవి ఎలాగో ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు బీజేపీ కొట్టిన పన్ను దెబ్బ...ఆప్ మీద గట్టిగానే పడనుందని తెలుస్తోంది. ఢిల్లీలో ఆప్ పదేళ్ల నుంచీ పేద, మధ్య తరగతి వారే లక్ష్యంగా పాలన చేసుకుంటూ వస్తోంది. ఇఫ్పుడు బీజేపీ కూడా అదే బాట పట్టింది. కేజ్రీవాల్ కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఇది మరింతప్రావం చూపనుంది. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. దీంతో వారందరూ బీజేపీకే ఓటేయొచ్చని అంటున్నారు.
Also Read: UNION BUDGET 2025: మీ సాలరీ ఎంత? కట్టాల్సిన ట్యాక్స్ ఎంత?.. సింపుల్ గా తెలుసుకోండిలా..!