![JP Nadda](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/17/iLSXqYAnfbAKtwa13iVW.jpg)
JP Nadda
BJP Manifesto: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తాజాగా మేనిఫెస్టోను ప్రకటించింది. 'సంకల్ప పత్రా' పార్ట్-1 పేరుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) మేనిఫెస్టోను ప్రకటించారు. గర్భిణీలకు రూ.21 వేల ఆర్థిక సాయం, పేదలకు రూ.500 లకే ఎల్పీజీ సిలిండర్లు, మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. వీటితో సహా ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కూడా అలాగే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
Also Read: ఘోర ప్రమాదం.. 40మంది పాకిస్థానీ వలసదారులను మింగేసిన సముద్రం.. ఎక్కడంటే?
మేనిఫెస్టో(BJP Manifesto) హామీలు ఇవే
- గర్భిణులకు రూ.21 వేల ఆర్థిక సాయంతో పాటు ఆరు పౌష్టికాహార కిట్లు ఇవ్వడం. ప్రస్తుతం ఇస్తున్నటువంటి మొదటి సంతానంలో రూ.5వేలు, రెండో సంతానానికి రూ.6 వేలు ఇవి అదనంగా ఇవ్వడం.
2. ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat) పథకాన్ని అమలు చేయడం. అలాగే దీనికి అదనంగా రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీ అందించడం.
3. మహిళా సమృద్ధి యోజన స్కీమ్ కింద మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం
4. పేదలకు రూ.500 లకే LPG గ్యాస్ సిలిండర్లు అందించడం. అలాగే ప్రతీ హోలీ, దీపావళి పండుగల సమయంలో ఫ్రీగా గ్యాస్ సిలిండర్(Free Gas Cylinder)
5. 60 నుంచి 70 ఏళ్ల వయోవృద్ధులకు రూ.2500 పెన్షన్, 70 ఏళ్ల పైబడిన వాళ్లకి రూ.3000 పెన్షన్ ఇవ్వడం
6. జేజే క్లస్టర్లలో అటల్ క్యాంటీన్‌లు ఏర్పాటు చేయడం. అలాగే రూ.5కే భోజనం పెట్టడం.
7. సంక్షేమ పథకాలను అమలు చేసే అంశాల్లో వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయడం.
Also Read: ఆయుష్మాన్ భారత్ ఒప్పందం.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలకు సుప్రీం కోర్టు బ్రేక్
ఇదిలా ఉండగా ఢిల్లీలో(Delhi) ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్‌లో(Arvind Kejriwal Liquor Scam) జెలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈసారి ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే