/rtv/media/media_files/2025/03/15/9Gzd1GGg0hfN11ymMNiL.jpg)
bihar encntr Photograph: (bihar encntr)
Encounter: బీహార్ ముంగేర్‌లోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ ASI సంతోష్ కుమార్ సింగ్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల్లో ఒకరైన గుడ్డు యాదవ్‌ను అరెస్టు చేయగా మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా సంలచన నిర్ణయం తీసుకున్నారు. కేసుకు సహకరించకుండా ఎదురుదాడులకు పాల్పడిన నిందితులను అవసరమైన ఎన్ కౌంటర్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
పోలీసులపై నిందితుడు దాడి..
ఈ మేరకు పోలీసులు గుడ్డు యాదవ్‌ను అరెస్టు చేసిన తర్వాత తీసుకెళ్తుండగా పోలీసు వాహనం బోల్తా పడింది. ఆ తర్వాత నిందితుడు గుడ్డు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుల నుండి ఆయుధాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితుడి కాలికి కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంపై మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా.. ఈ సంఘటన విచారకరం. ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నేరాలను అంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మేము సుపరిపాలన కోసమే అధికారంలో ఉన్నాం. ప్రభుత్వం అధికారులపై ఎవరూ దాడి చేసిన ఊరుకోం. నేరస్థుడి వాదన వినేందుకు ప్రభుత్వం నుండి పూర్తి స్వేచ్ఛ ఉంది. కానీ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్‌కౌంటర్ చేస్తామని హెచ్చరించారు.
Also Read: మహిళా ఎస్ఐపై కానిస్టేబుల్ అత్యాచారం.. బ్లాక్‌మెయిల్ చేస్తూ.. చివరికి!
అసలు ఏం జరిగిందంటే..
ASI సంతోష్ సింగ్ పోలీసు బృందంతో కలిసి ఓ వివాదాన్ని పరిష్కరించడానికి ముంగేర్‌లోని నందలాల్‌పురా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగిందని స్థానికులు తెలిపారు. ఇరువర్గాలతో మాట్లాడుతున్న క్రమంలో గొడవ మరింత పెద్దదైంది. గుర్తు తెలియని వ్యక్తి పదునైన ఆయుధంతో ASI సంతోష్ కుమార్ తలపై దాడి చేశాడు. ఈ దాడిలో ఏఎస్ఐ సంతోష్ తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో ASI మరణించాడు.
Also Read: హోలీ రోజు ఆకతాయిలు చేసిన పనికి.. 8 మంది అమ్మాయిలు హాస్పిటల్ పాలైయ్యారు