Railway Station: ఆ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే.. ఎక్కడో తెలుసా ?

సాధారణంగా రైళ్లలో టికెట్లు కొని ప్రయాణాలు చేస్తారు. కానీ ఓ రైల్వే స్టేషన్‌లో మాత్రం ఇలా ఉండదు. అక్కడికి వెళ్లాలంటే తప్పకుండా పాస్‌పోర్టు, వీసా కావాల్సిందే.ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
Attari Railway Station in Punjab requires passport and visa

Attari Railway Station in Punjab requires passport and visa

భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు వెళ్తుంటారు. సాధారణంగా రైళ్లలో టికెట్లు కొని ప్రయాణాలు చేస్తారు. కానీ ఓ రైల్వే స్టేషన్‌(railway-station) లో మాత్రం ఇలా ఉండదు. అక్కడికి వెళ్లాలంటే తప్పకుండా పాస్‌పోర్టు(passport), వీసా(visa) కావాల్సిందే. ఇంతకీ ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో 'అటారీ శ్యామ్ సింగ్' అనే రైల్వే స్టేషన్ ఉంది. పాకిస్థాన్‌ సరిహద్దుకు దగ్గరగా ఇది ఉంటుంది. భారత్‌లో చివరి రైల్వే స్టేషన్ ఇదే. 

Also Read: దేశంలో UGC, వన్ నేషన్ -వన్ ఎలక్షన్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

Attari Railway Station In Punjab Requires Passport And Visa

ఈ రైల్వే స్టేషన్ నుంచే ప్రయాణికులు పాకిస్తాన్‌లోని లాహోర్‌కు వెళ్తుంటారు. అందుకే ఈ స్టేషన్‌లోకి వెళ్లే భారతీయ పౌరులు కచ్చితంగా పాకిస్తాన్ వీసా కలిగి ఉండాలి. ఇక్కడి రూల్స్‌ కూడా కఠినంగా ఉంటాయి. ఎవరైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఈ రైల్వే స్టేషన్‌లోకి వస్తే వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలనుకునే వారు ముందుగానే అన్ని డాక్యుమెంట్సు రెడీగా ఉంచుకోవాలి.  

Also Read: రోడ్లపైకి వస్తున్న పశువులు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ స్టేషన్ నుంచి సంఝౌతా అనే ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తుంది. ఇది భారత్, పాకిస్తాన్ మధ్య రాకపోకలు సాగిస్తోంది. కానీ పలు రాజకీయ కారణాల వల్ల కొన్నిసార్లు ఈ రైలును నిలిపివేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు అటారి రైల్వేస్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టంగా ఉంటాయి. ఇక్కడ కూలీలు కనిపించరు. ప్రయాణికులే తమ లగేజ్‌ను మోసుకెళ్లాలి. ఈ స్టేషన్ చిన్నదే అయినప్పటికీ మంచి సౌకర్యాలు ఉంటాయి.  

Advertisment
తాజా కథనాలు