/rtv/media/media_files/2025/02/06/Uy9FtKdbHTLpHafSrt3a.webp)
Road Accident in Jaipur
Mahakumbha Mela Accident: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్లాదిగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళా సంగమ స్థలిలో పుణ్య స్నానాలు చేయడానికి వెళ్లిన భక్తుల్లో 30 మంది ఇటీవల మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మహాకుంభమేళాలో భాగంగా పుణ్యస్నానాలకు వెళుతున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో 8మంది భక్తులు మృతి చెందారు. రాజస్థాన్ జైపూర్ నుంచి కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న కారు మోఖంపుర సమీపంలోని 48వ జాతీయ రహదారి పైన డివైడర్ ను ఢీకొట్టింది(Kumbh Mela). ఈ క్రమంలో కారు ఎదురుగా వస్తున్న బస్సు పైకి దూసుకెళ్లడంతో 8 మంది భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Also Read : తాడేపల్లి వైసీపీ ఆఫీస్ సమీపంలో అగ్ని ప్రమాదం
మహాకుంభమేళాకు వెళ్తుండగా ప్రమాదం..
మహాకుంభమేళా నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు చేరుకుంటున్నారు. అందులో భాగంగా జైపూర్ నుంచి ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పగిలిపోవడంతో అదుపు తప్పి రోడ్డుపై వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో కారులోని ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు.
Also Read : కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
144 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే మహాకుంభమేళా 45రోజుల పాటు కొనసాగనుంది. ఇప్పటికే కోట్లాదిమంది ఈ మేళాలో పాల్గొన్నారు. కాగా రోజుకు కోటిమంది చొప్పున మహాకుంభమేళాకు 45కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.ఈ మహాకుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న ముగియనుంది. కాగా జనవరి 29న జరిగిన మౌని అమావాస్య రోజున పుణ్యస్నానాలు చేయడానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి 30 మంది చనిపోయారు.
Also Read : By-Elections : తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు ..కేటీఆర్ సంచలన కామెంట్స్