/rtv/media/media_files/2025/01/01/aXA1WWqy1MkjiMWTaBGg.jpg)
Alahabad rape case
Alahabad High Court: అపరిచిత మహిళల వక్షోజాలు పురుషులు తాకడంపై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇద్దరు యువకులు ఓ బాలికను అసభ్యంగా తాకిన కేసును విచారించిన న్యాయస్థానం.. మైనర్ వక్షోజాలు పట్టుకోవడం అత్యాచార నేరం కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
11ఏళ్ల బాలికను బలవంతంగా..
ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌లో ఇటీవల పవన్, ఆకాష్ అనే ఇద్దరు యువకులు 11ఏళ్ల బాలిక వక్షోజాలను బలవంతంగా తాకారు. ఇందులో ఒక యువకుడు ఆమె పైజామా దారం తెంపివేశాడు. మరొక యువకుడు ఆ బాలిక ప్యాంట్ కిందికు లాగేందుకు బలవంతం చేశాడు. ఆమె కేకలు వేయడంతో నిందితులిద్దరూ అక్కడినుంచి పారిపోయారంటూ బాధితిరాలి తరఫు బంధువులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న 'లూసిఫర్2: ఎంపురాన్' ట్రైలర్..!
మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశం..
ఈ కేసును మొదట విచారించిన అలహాబాద్ ట్రయల్ కోర్టు.. పోక్సో చట్టంలోని సెక్షన్ 376, సెక్షన్ 18 (అత్యాచారం, నేరం చేయడానికి ప్రయత్నించడం) ప్రకారం నిందితులకు సమాన్లు పంపింది. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే కేసుపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. 'మైనర్ బాలికల వక్షోజాలను పట్టుకోవడం, పైజామా దారం తెంపివేయడం, పారిపోయే ముందు ప్యాంట్ కిందికి లాగడం అత్యాచారయత్నంగా పరిగణించబడవు. ఇది పోక్సో చట్టంలోని సెక్షన్ 376, సెక్షన్ 15 నేరాల కిందికి రాదు. కానీ పోక్సో సెక్షన్ 9/10, సెక్షన్ 354-B ( లైంగిక వేధింపులు, మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) ప్రకారం సమన్లు జారీ చేయొచ్చు అని స్పష్టం చేశారు.
Also Read: దెయ్యాలతో చెడుగుడు ఆడేస్తాం.. ఎనీ డౌట్స్..?
(high-court | rape-attempt | today telugu news | latest-telugu-news | rtv telugu news)