/rtv/media/media_files/2025/02/25/Rk56eNrJBabqJDxBtwsJ.jpg)
agriculture ai Photograph: (agriculture ai)
అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI).. ప్రస్తుతం ప్రపంచ దేశాల అభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగాన్నీ AI ప్రభావితం చేస్తోంది. విద్య, వైద్యం, తయారీ తదితర రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృత్రిమ మేధ ఎంతో దోహదం చేస్తుంది. అయితే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లనే వెల్లడించారు. మహారాష్ట్ర బారామతి రైతులు ఏఐను ఉపయోగించుకుని మంచి దిగుబడులు సాధిస్తున్నారని ఆయన ఎక్స్‌లో ఓ వీడియోను కూడా షేర్ చేయగా ఇది వైరల్ అవుతోంది. నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న బారామతిలోని బట్టీస్ షిరాలా ప్రాంతంలో సన్నకారు రైతులు ఏఐ సాయంతో మంచి దిగుబడిని సాధించినట్టు తెలిపారు. దీనిపై AI అన్నింటిని మెరుగుపరుస్తుందని ఎలాన్ మస్క్ సైతం స్పందించారు.
A fantastic example of AI's impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ
— Satya Nadella (@satyanadella) February 24, 2025
Also Read :
మైక్రోసాఫ్ట్ వ్యవసాయ ప్రయోగాలు..
బారామతిలో గత రెండేళ్లుగా మైక్రోసాఫ్ట్ వ్యవసాయ ప్రయోగాలు చేస్తోంది. కరువు కటకాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో అక్కడి సాగులోకి ఏఐ పరికరాలను మైక్రోసాఫ్ట్ ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రాంత ఉష్ణోగ్రతలు, భూసారంపై ఏఐ అందించిన సమాచారం ఆధారంగా చెరుకు పంట వేసి ఓ రైతు మంచి ఫలితాలు సాధించారు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజూర్ డేటా మేనేజర్ ఫర్ అగ్రికల్చర్ సహకారంతో డేటా ఆధారిత పరిష్కారాలకు మార్గం సుగుమమైంది. శాటిలైట్లు, వాతావరణ కేంద్రాలు, సాయిల్ సెన్సర్ల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా రైతులకు వారి భూమి గురించి సమగ్రమైన అవగాహన కల్పించారు. నేలలోని తేమ, ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, పోషకస్థాయిలు ఇలా అన్ని రకాల వివరాలను అగ్రిపైలట్, ఏఐ అనే మొబైల్ యాప్ ద్వారా రైతులకు అందించారు. ఈ సమాచారమంతా స్థానిక భాషలోనే ఉండడంతో రైతులకు దాన్ని అర్థం చేసుకోవడం తేలికైంది. ఏఐ లాగరిథమ్స్ ఈ డేటాను విశ్లేషించి విత్తనాలు ఎప్పుడు నాటాలి, ఏ సమయంలో ఎంత నీరందించాలి, తెగుళ్ల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలను రియల్‌టైమ్‌లో విశ్లేషించి రైతులకు తెలియజేసిందని సత్యనాదేళ్ల తెలిపారు.
ఇది కూడా చదవండి: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్!
AI ద్వారా పంట దిగుబడి..
రైతులు తమ వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని, ఉత్పాదకతను పెంపొందించుకోవడంలో కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుంది. AI ద్వారా పంట దిగుబడిలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. రసాయనాల వినియోగం తగ్గింది. తక్కువ నీటిని సమర్థవంతంగా వాడటం వంటి ప్రయోజనాలను రైతులు పొందుతున్నారు. స్థిర వ్యవసాయానికి ఏఐ ముఖ్య సహాయకారిగా మారుతోంది. డ్రోన్లు, సెన్సర్లు తదితరాల ద్వారా రైతులు నేల ఆరోగ్యం, వాతావరణ పరిస్థితులు, పంట పెరుగుదల, తెగుళ్ల గురించి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఏఐ ఆధారిత ముందస్తు విశ్లేషణల సాయంతో మార్కెట్ పోకడలను తెలుసుకుని, నష్టాలను తగ్గించుకోవచ్చు. నేల స్వభావం, పంట రకాలు, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను ఏఐ సాంకేతికత సూచిస్తుంది. ఈ కృత్రిమ మేథ ద్వారా వ్యవసాయం రంగంలో అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు.
ఇది కూడా చదవండి: Nalgonda: పంటపోలాల్లో నోట్ల కట్టల కలకలం.. బ్యాంక్ పేరు చూసి కంగుతిన్న పోలీసులు!