/rtv/media/media_files/2025/03/05/2GUDhDGUcek3etDmxS9k.jpg)
CM Yogi Adithyanath
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ (Uttar Pradesh Assembly) లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రీసెంట్ గా ముగిసిన కుంభమేళా (Kumbh Mela 2025) నిర్వహణపై ప్రతిపక్షాలు యోగి ఆదిత్య నాథ్ ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. దీనికి సీఎం యోగి సమాధానం చెబుతూ..కుంభమేళా వల్ల చాలా మంది ఆర్థికంగా బాగుపడ్డారని అన్నారు. ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా దాదాపు రూ.30 కోట్లు ఆర్జించిందని తెలిపారు. కుంభమేళా సమయంలో తనకున్న 130 పడవలను నడిపే అతను ఈ డబ్బులు సంపాదించాడని అన్నారు. ఒక్కో పడవతో రోజుకు రూ. 50 నుంచి 52 వేల వరకు సంపాదించారని వివరాలు తెలిపారు. దీనివలన 45 రోజులకు ఒక్కో పడవతో దాదాపు రూ.23లక్షల చొప్పున ఆదాయం సమకూరింది. అలా మొత్తంగా 130 పడవలతో రూ.30కోట్లు సంపాదించారని సీఎం ఆదిత్య నాథ్ తెలిపారు.
Also Read : మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Also Read : కోడిని కోశావా.. కోడి మిస్సింగ్ కేసులో వ్యక్తికి పోలీసుల థర్డ్ డిగ్రీ
లక్షల కోట్లు వచ్చాయి..
కుంభమేళాను తాము అత్యంత అద్భుతంగా నిర్వహించామని చెప్పుకున్నారు సీఎం యోగి (Yogi Adityanath). దేశ విదేశాల నుంచి కోట్లమంది ప్రజలు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేశారని...45 రోజుల్లో ఒక్క రోజు కూడా ఏ నేరం చోటు చేసుకోదలని తెలిపారు. కుంభమేళా నిర్వహణ కోసం రూ.7500 కోట్ల పెట్టుబడులు పెట్టగా.. దాదాపు రూ.3లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని లెక్కలు చెప్పారు. హోటల్ పరిశ్రమకు రూ.40వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసరాల రంగానికి రూ.33వేల కోట్లు, రవాణాకు రూ.1.5లక్షల కోట్ల మేర ఆదాయం వచ్చిందని తెలిపారు.
Also Read: USA: అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం
Also Read : అమెరికా ఇంక తగ్గేదే లే..యూఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ మొదటి ప్రసంగం