Kamal Haasan : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. రాజ్యసభకు కమల్ హాసన్?

MNM పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ సీఎం స్టాలిన్‌తో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని.. డీఎంకే పార్టీకి తాము మద్దతు ఇస్తున్నట్లు కమల్ హాసన్ ప్రకటించారు. పొత్తులో భాగంగా తమకు ఒక రాజ్యసభ సీటు ఇస్తామని సీఎం స్టాలిన్ చెప్పినట్లు తెలిపారు.

New Update
Tamilnadu: రెండు రోజుల్లో శుభవార్త చెబుతా..కమల్ హసన్

Rajya Sabha : లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) వేళ తమిళనాడు(Tamilnadu) రాజకీయాల్లో ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. మక్కల్ నీధి మయం పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్(Kamal Haasan) తమిళనాడు రాష్ట్ర సీఎం స్టాలిన్(CM Stalin) తో భేటీ అయ్యారు. లోక్ సభ ఎన్నికలపై వారు కలిసి చర్చించారు. లోక్ సభ ఎన్నికల వేళ వీరి భేటీ చర్చనీయాంశమైంది.

డీఎంకే పార్టీకి మద్దతు..

ఈ భేటీలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్(MNM) పోటీ చేయడం లేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం పేర్కొన్నారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి మద్దతు ఇస్తుందని.. ప్రచారంలో వారితో తమ పార్టీ నేతలు పాల్గొంటారని తెలిపారు. సీఎం స్టాలిన్ తో జరిగిన భేటీలో 2025 రాజ్యసభ ఎన్నికల్లో(Rajya Sabha Elections) మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి డీఎంకే ఒక సీటు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ నిర్ణయం దేశం కోసం...

తమిళనాడు సీఎం స్టాలిన్ తో భేటీ అనంతరం కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై వివరణ ఇచ్చారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ తో పొత్తు పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఈ పొత్తులో భాగంగా తమ పార్టీ పూర్తి మద్దతు డీఎంకే పార్టీకి ఉంటుందని అన్నారు. డీఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది పదవుల కోసం కాదని.. దేశ బాగు కోసమని అన్నారు.

రాజ్యసభకు కమల్ హాసన్?

పొత్తులో భాగంగా మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 2025లో ఒక రాజ్యసభ సీటు ఇస్తామని డీఎంకే పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన అనంతరం ఆ ఒక్క రాజ్యసభ సీటు నుంచి కమల్ హాసన్ పోటీ చేస్తారనే ప్రచారం తమిళనాడు రాజకీయాల్లో మొదలైంది. ఆయనను డీఎంకే పార్టీ రాజ్యసభకు పంపుతుందనే కారణంతోనే కమల్ హాసన్ పొత్తు పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న ప్రచారం ఒకెత్తు అయితే.. కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్తారా? అనేది మరో అంశం. కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్తారా? లేదా? అనేది తెలియాలంటే 2025 వరకు వేచి చూడాలి.

Also Read : టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Danam Nagender : కేసీఆర్ వరంగల్ సభ సక్సెస్ అవుతుంది.. దానం సంచలన కామెంట్స్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  మరోవైపు ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని వెల్లడించారు.

New Update
danam nagender brs

danam nagender brs

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన కామెంట్స్ చేశారు.  బీఆర్ఎస్ వరంగల్ సభ సక్సెస్ అవుతుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్ కోసం భారీగా జనం వస్తారని అన్నారు.  ఎప్పటినుండో కేసీఆర్‌ ను చూడ్డానికి జనం ఆశగా ఉన్నారని..   సభకు కూడా జనం బాగా వస్తారని తాను కూడా అనుకుంటున్నాని తెలిపారు.  హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి రామన్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణగూడ కమ్యూనిటీ హల్ లో జలమండలి, ఇతర అధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఐపీఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ సబబే అని దానం వెల్లడించారు.  

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

వ్యక్తిగతంగా బాధించింది

అయితే  రాష్ట్ర సీఎస్ శాంతకుమారిపై సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడం తనను వ్యక్తిగతంగా బాధించిందన్నారు. శాంతకుమారికి మంచి అధికారిగా పేరు ఉందన్నారు.  కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోందని వెల్లడించారు.  కాగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్‌పై దానం అనుకూలంగా కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మళ్లీ దానం బీఆర్ఎస్‌లోకి వెళ్తారంటూ పోలిటికల్ సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.  ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్  తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన దానం ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.  

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

Advertisment
Advertisment
Advertisment