/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/reverse-jpg.webp)
Reverse Walking
Reverse Walking: ఎలాంటి అనారోగ్య సమస్యలు(Health Issues) లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే వాకింగ్(Walking) అనేది తప్పనిసరి. డైలీ ఒక పది నిమిషాలు అయిన వాకింగ్ చేయడం వల్ల ఎక్కువ కాలం జీవిస్తారని నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది ముందుకు నడుస్తుంటారు. కానీ ముందుకు కాకుండా వెనక్కి నడవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వెనక్కి కనీసం ఒక పది అడుగులు అయిన వేయడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధి రాదు. అయితే కొత్తలో వెనక్కి నడవడం చాలా కష్టం. రోజుకి ఒక పది అడుగులు వెనక్కి నడుస్తూ.. డైలీ పెంచితే ఆరోగ్యంగా ఉంటారు.
ఇది కూడా చూడండి: ఖేల్ రత్న అవార్డ్‌లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము
కొలెస్ట్రాల్ కరుగుతుంది
కష్టమైన వెనక్కి నడవడం వల్ల మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుంది. కేవలం వాకింగ్ అనే కాకుండా సైక్లింగ్(Cycling), స్విమ్మింగ్(Swimming) అన్ని కూడా వెనక్కి చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. రోజుకి కనీసం ఒక 30 నిమిషాలు అయిన కూడా వెనక్కి నడవడం వల్ల బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అంతా కూడా కరుగుతుంది. అనారోగ్య సమస్యలు లేకుండా ఫిట్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి వెనక్కి వాకింగ్ చేసేలా అలవాటు చేయాలి. దీనివల్ల వారి జ్ఞాపకశక్తి(Memory Power) మెరుగుపడుతుంది. వారి ఆలోచన విధానం మారుతుంది.
ఇది కూడా చూడండి: Saif Ali Khan: సైఫ్ ను పొడిచిన కత్తి ఇదే.. ఎంత లోతు దిగిందంటే?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Arvind Kejriwal: ప్రధానిమోదీకి కేజ్రీవాల్ సంచలన లేఖ.. ఏం చెప్పారంటే ?
ఇది కూడా చూడండి: Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష