Obesity Children: పిల్లల్లో ఊబకాయం పెరగడానికి కారణాలు ఇవే

పిల్లలలో ఊబకాయం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. స్థూలకాయం కారణంగా పిల్లలు మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు బాధపడుతున్నారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చున్న కారణంగా శారీరక శ్రమ తగ్గింది. జన్యుపరమైన, జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం పెరుగుతుంది.

New Update

Obesity Children: గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఊబకాయం సమస్య పెరుగుతోంది. ఈ కేసుల సంఖ్య ప్రతి సంవత్సరం రెట్టింపు అవుతోంది. మన దేశంలో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఊబకాయం కేసులు రెట్టింపు అయ్యాయి. ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఈ సమస్య పిల్లలలో నాలుగు రెట్లు పెరిగింది. పెద్దల కంటే పిల్లలలో ఊబకాయం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. స్థూలకాయం కారణంగా పిల్లలు మధుమేహం నుండి గుండె జబ్బుల వరకు బాధపడుతున్నారని ఓ నివేదిక పేర్కొంది.

పిల్లలలో ఊబకాయం:

ప్రపంచ వ్యాప్తంగా పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిలో ఊబకాయం ప్రాబల్యం 1990తో పోలిస్తే 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగిందని అంచనా. ఊబకాయం కారణంగా పిల్లలలో టైప్-2 డయాబెటిస్, గుండె జబ్బుల కేసులు కూడా పెరిగాయి. ఊబకాయం కారణంగా పిల్లలలో హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు కూడా గుర్తించారు. అంతేకాకుండా పిల్లల మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. పిల్లలలో ఊబకాయం రేట్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. పిల్లల జీవనశైలి ప్రధాన కారణాలలో ఒకటి. అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చుంటారు. ఈ కారణంగా వారి శారీరక శ్రమ కూడా తగ్గింది. 

ఇది కూడా చదవండి: మూర్ఛ వ్యాధి ఎందుకు వస్తుంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పిల్లలలో జంక్ ఫుడ్ తినే ధోరణి కూడా వేగంగా పెరుగుతోంది. ఇది ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా ఊబకాయం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఊబకాయం రావచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో జీవనశైలి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఊబకాయాన్ని ప్రోత్సహిస్తాయని నిపుణులు అంటున్నారు. పిల్లల్లో ఊబకాయం సమస్యను నియంత్రించాలంటే బయటకు వెళ్లి ఆడుకోవాలని ప్రోత్సహించాలి. పిల్లల ఆహారంలో పిండి, చక్కెర, ఉప్పును తగ్గించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అవసరానికి మించి ఉపయోగించనివ్వకండి. ఇంటి వాతావరణాన్ని బాగుండేలా చూసుకోండి. ఎందుకంటే పిల్లలపై మానసిక ఒత్తిడి వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. పిల్లల ఆహారం, నిద్ర, జీవనశైలిని మెరుగుపరచాలి.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: బొప్పాయి, అరటిపండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పరగడుపున ఈ ఎల్లో పండు తింటున్నారా.. మీ పని ఖతం

పరగడుపున అరటి పండ్లను తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆమ్లం జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. ఏదైనా టిఫిన్ చేసిన తర్వాత అరటి పండును తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కాబట్టి పరగడుపున ఎప్పుడూ కూడా అరటి పండు అసలు తీసుకోవద్దు.

New Update
Health Tips : ఈ 5 అలవాట్లు మిమ్మల్ని రోజంతా యాక్టివ్ గా ఉంచుతాయి..అలసటను దూరం చేస్తాయి...!!

Morning

సీజన్‌తో సంబంధం లేకుండా అరటి పండ్లు లభిస్తాయి. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోటాషియం, కాల్షియం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే చాలా ఈ అరటి పండును తింటుంటారు. కానీ పరగడుపున అరటి పండ్లను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే వీటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

జీర్ణక్రియపై ఒత్తిడి పడుతుందని..

అరటి పండ్లను ఉదయం అల్పాహారంలో తీసుకోవచ్చు. కానీ ఏం తినకుండా పరగడుపున అయితే అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అరటి పండు ఎక్కువగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. పరగడుపున దీన్ని తీసుకుంటే జీర్ణక్రియపై ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల కడుపు సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అరటి పండ్లను ఉదయాన్నే తినవద్దు.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

ఏదో ఒకటి తిన్న తర్వాత అరటి పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం గుండె, కిడ్నీ ఆరోగ్యం, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. అలాగే శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుందని నిపుణులు అంటున్నారు. రోజుకి ఒక రెండు అరటి పండ్లు తింటే శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. అలసట అంతా కూడా తొలగిపోతుందని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి: Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

Advertisment
Advertisment
Advertisment