Diabetes and Gym
Diabetes: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యకు అనేక కారణాలు ఉన్నాయి. డయాబెటిస్ వచ్చిన తర్వాత జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు మందులు వాడటం తప్ప వేరే మార్గం లేదు. అందుకే మీరు మొదటి నుంచి దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు జిమ్‌కు వెళ్ల వచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు జిమ్‌కు వెళ్లడం ఖచ్చితంగా మంచి ఆలోచన. అయితే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లే ముందు రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.
గుండె ఆరోగ్యానికి..
ఎందుకంటే వ్యాయామం చేసినప్పుడు సాధారణంగా చక్కెర స్థాయి తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే వ్యాయామం తర్వాత గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి జిమ్‌కి వెళ్లే ముందు షుగర్ లెవెల్స్ తనిఖీ చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. జిమ్‌కు వెళ్లే ముందు తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. జిమ్‌కు వెళ్లే ముందు అరటి పండ్లు, ఆపిల్ వంటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ ఆహారాలు తినడం వల్ల చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఏరోబిక్, రెసిస్టెన్స్ వ్యాయామం కలయిక మంచి ఫలితాలను ఇస్తుంది. రెసిస్టెన్స్ వ్యాయామంలో వెయిట్ లిఫ్టింగ్, పుష్-అప్స్, పుల్-అప్స్ ఉంటాయి.
ఇది కూడా చదవండి: నిజంగానే.. కాకరకాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా?
ఏరోబిక్ వ్యాయామాలలో ట్రెడ్‌మిల్, నడక, ఈత ఉన్నాయి. అందువల్ల జిమ్‌లో ఈ రెండు కాంబినేషన్‌లను ప్రయత్నించడం వల్ల చక్కెర నియంత్రణలో ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి, కండరాల పెరుగుదలకు సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కేవలం ఏరోబిక్స్ మాత్రమే కాదు రెసిస్టెన్స్ వ్యాయామాల కలయిక ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. ఒక గంట పాటు జిమ్‌కు వెళ్లడంలో తప్పులేదు. ఎక్కువ సమయం జిమ్ చేయాల్సి వస్తే షుగర్స్ లెవల్స్ పరీక్షించుకోవాలి.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది
( best-fruits-for-diabetes | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips | latest-news | telugu-news )