Shooting Updates: షూటింగ్ అప్ డేట్స్.. ఏ సినిమా ఎక్కడ?

స్టార్ హీరోల్లో ఒక్కరు కూడా ఖాళీగా లేరు. తమ సినిమాల్ని పూర్తిచేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ..ఇలా హీరోలంతా తమ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఏ హీరో ఏ సినిమా షూటింగ్‌లో ఎక్కడ ఉన్నారో చెక్ చేద్దాం..

New Update
Shooting Updates: షూటింగ్ అప్ డేట్స్.. ఏ సినిమా ఎక్కడ?

Telugu Movies Shooting Updates: ఎన్టీఆర్, దేవర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. దీని కోసం ప్రత్యేకమైన సెట్ వేశారు. భారీ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుచేసి, అందులో తారక్‌పై అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు, సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొంటున్నారు.

Pushpa-2

జాతీయ అవార్డ్ గ్రహీత అల్లు అర్జున్ (Allu Arjun), పుష్ప-2 షూట్‌లో బిజీగా ఉన్నాడు. హైదరాబాద్‌లో వేసిన సెట్‌లో బన్నీపై కొన్ని కీలక సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. మరో 2 రోజుల్లో ఇదే షెడ్యూల్‌లో హీరోయిన్ రష్మిక కూడా జాయిన్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది పుష్ప-2 సినిమా. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Telugu Movies Shooting Updates

Vijay Devarakonda:

విజయ్ దేవరకొండ ప్రస్తుతం 2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓవైపు ఖుషి (Kushi) సినిమా ప్రచారం చేస్తూనే, మరోవైపు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టుడియోస్‌లో ఈ మూవీకి సంబంధించి షూట్ నడుస్తోంది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్‌పై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. సైమల్టేనియస్‌గా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి.

Telugu Movies Shooting Updates

Prabhas:

ఇటు ప్రభాస్ కల్కి సినిమా సెట్స్‌లో బిజీగా ఉన్నారు. కల్కి సినిమాలో నటిస్తూనే, మరోవైపు సలార్ మూవీ ప్యాచ్ వర్క్ పూర్తిచేసే పనిలో పడ్డాడు. మరికొన్ని రోజుల్లో సలార్ (Salaar) నుంచి ట్రయిలర్ రాబోతోంది.

Telugu Movies Shooting Updates

Ram Charan:

రామ్ చరణ్ కూడా తమ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూట్‌లో ఉన్నాడు రామ్ చరణ్.

publive-image

Also Read: భైరవద్వీపం ట్రయిలర్‌కు భారీ స్పందన

Advertisment
Advertisment
తాజా కథనాలు