Virat Kohli: కోహ్లీని కొట్టేవాడే లేడు...మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ బద్దలు

జరగదేమో అనుకున్న మ్యాచ్ జరగడమే కాదు అందులో టీమ్ ఇండియా సూపర్ విక్టరీని కూడా సాధించింది. కింగ్ విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ లు సెచరీలతో చెలరేగిపోయారు. రికార్డులను బద్దలు కొట్టారు.

New Update
Virat Kohli: కోహ్లీని కొట్టేవాడే లేడు...మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రికార్డ్ బద్దలు

ఆసియా కప్ సూపర్ -4లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 228 పరుగుల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోరును పాకిస్తాన్ ముందు ఉంచింది. తరువాత బ్యాటింగ్ చేసిన పాక్ 32 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్ అయింది. గాయాల కారణంగా రవూఫ్, నసీమ్ షాలు అసలు బ్యాటింగ్ కే దిగలేదు. దీంతో ఎనిమిది వికెట్లకే ఇన్నింగ్సును ముగించాల్సి వచ్చింది.

భారత జట్టులో ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరూ హాఫ్ సెంచురీలతో శుభారంభాన్ని ఇచ్చారు. తరువాత వచ్చిన విరాట్, కే ఎల్ రాహుల్ లు చివర వరకు ఆడి సెంచురీలతో భారత్ ను విజయం దిశగా పరుగులుపెట్టించారు. విరాట్ 94 బంతుల్లో 122 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా...కే ఎల్ రాహుల్ 106 బంతుల్లో 111 పరుగులు చేశాడు. మరోవైపు టీమ్ ఇండియా బౌలర్లు కూడా చెలరేగిపోయారు. ముందు నుంచే పాక్ ఆటగాళ్ళను కట్టడి చేస్తూ మ్యాచ్ ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన కులదీప్ 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక బుమ్రా, శార్ధూల్, హార్ధిక్ పాండ్యాలు తలా ఒక వికెట్ తీసుకున్నారు.

 king virat kohli beated sachin, raina's all time records.

భారత్-పాక్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మ్యాజిక్ చేశాడు. అందుకే అతడికి మ్యాన్ ౠఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. దీంతో ఇంతకు ముందు సురేష్ రైనా, సిద్ధు పేరిట ఉన్న రికార్డ్ను కోహ్లీ బద్దలు కొట్టినట్టు అయింది. ఆసియా కప్ వన్డే ఫార్మాట్ లో ఎక్కువ సార్లు మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్న భారత్ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ మ్యాచ్ తో విరాట్ 4వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. అంతకు ముందు రైనా, సిద్ధూలు 3సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు తీసుకున్నారు.

మరోవైపు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ నూ అధిగమించాడు కింగ్ కోహ్లీ. ఆసియా కప్ సూపర్-4లో పాక్ మీద సెంచరీ చేసిన విరాట్ అంతర్జాతీయ వన్డేల్లో తన 47వ వందను సాధించాడు. దీంతో వన్డే క్రికెట్ లో తక్కువ ఇన్నింగ్స్ లో 13వేల పరుగులు పూర్తి చేసుకున్న మొదటి బ్యాట్స్ మన్ గా కోహ్లీ రికార్డ్ నమోదు చేసుకున్నాడు. ఇంతకు ముందు సచిన్ పేరిట ఈ రికార్డ్ ఉండేది. సచిన్ 321 ఇన్నింగ్స్ లలో 13 వేల పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ 267 మ్యాచ్ ల్లోనే దాన్ని అధిగమించాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు