Railway Jobs: రైల్వేలో 32000 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడైంది. రైల్వే మంత్రిత్వ శాఖ సంబంధించిన రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జారీ చేసిన లెవల్-1 గ్రూప్ డీ రిక్రూట్మెంట్ ను వెల్లడించింది. ఆర్‌ఆర్‌బీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ నం. 08/2024 ప్రకారం, వివిధ స్థాయి-1 దాదాపు 32000 పోస్ట్‌లపై రిక్రూట్మెంట్ విడుదల కానుంది. దీని ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 23 జనవరి 2025 నుండి ప్రారంభం అవుతుంది. Also Read: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ విజేతగా కోనేరు హంపి! దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 22 ఫిబ్రవరి 2025గా నిర్ణయించారు. దీని ప్రకారం, వయస్సు జులై 1 2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య వయస్కులై ఉండాలి. ఇక రిజర్వేషన్స్ ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. గత నెలల్లో జరిగిన వివిధ రైల్వే రిక్రూట్‌మెంట్‌ల మాదిరిగానే, గరిష్ట వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ప్రస్తావన కూడా అధికారులు వివరించారు. Also Read: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి కోవిడ్ మహమ్మారి కారణంగా, గరిష్ట వయో పరిమితిని మూడేళ్లు మినహయించారు. గరిష్ట వయోపరిమితి 33కి బదులుగా 36 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఈ మినహాయింపు ఒక్క సారి మాత్రమే. Also Read: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు! ఇకపోతే పరీక్ష సీబీటీ విధానంలో నిర్వహించనున్నారు. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రకటించిన నోటీసులో అన్ని వివరాలు ఉన్నాయి.10వ తరగతి ఉత్తీర్ణత లేదా ఎన్‌సీవీటీ సర్టిఫికేట్ ఉన్నవారు రైల్వే గ్రూప్ డీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే.. దరఖాస్తు చేయడానికి, జనరల్అండ్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 కట్టాలి. Also Read: మన్మోహన్ సింగ్ మృతి.. గ్రౌండ్‌లో నల్ల బ్యాడ్జిలతో టీమిండియా నివాళి! అంతేకాకుండా సీబీటీలో హాజరైనట్లయితే రూ. 400 వాపసు ఇవ్వడం జరుగుతుంది. అలాగే SC/ST/EBC/మహిళలు/ట్రాన్స్‌జెండర్లు రూ. 250 చెల్లించాలి.