/rtv/media/media_files/2025/04/04/faD9deQSl3AYumsy0byG.jpg)
us mayor
ఆయన ఓ నగరానికి మేయర్...అయితే కార్యాలయంలో ఉండగానే అతడికి విపరీతమైన కామవాంఛ కలిగి చచ్చింది. దీంతో హస్తప్రయోగం చేసుకుంటూ వీడియో తీసుకున్నాడు. ఆపై దాన్ని ప్రియురాలికి పంపించాలని అనుకున్నాడు. కానీ పొరపాటున దాన్ని ఆమెకు కాకుండా నగర న్యాయవాదికి పంపించాడు. దీంతో ఆ వీడియో చూసిన సదరు మహిళా లాయర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. మేయర్ తన తప్పుకు బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకున్నారు. తన మేయర్ పదవికి రాజీనామా చేశారు.
Also Read: Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!
అమెరికా ఉత్తర డకోటాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటైన మినోట్ మేయర్‌గా టామ్‌రాస్ పని చేస్తున్నారు. అయితే జనవరి 14వ తేదీన విధుల్లో ఉన్న ఆయన.. సిటీ ఆటార్నీ స్టెఫానీ స్టాల్‌హీమ్‌తో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్య కేసు గురించి ఫోన్‌లో చర్చించారు. ఆ తర్వాత కొంత సేపటికే ఆయన తన మొబైల్ ఫోన్ నుంచి సదరు న్యాయవాదికి హస్త ప్రయోగం చేసుకుంటూ వీడియోను పంపించారు. అయితే ఆ విషయాన్ని గుర్తించిన టామ్‌రాస్ వెంటనే దాన్ని డిలీట్ చేశాడు.
Also Read: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
కానీ డిలీట్ బై మీ ఓన్లీ కొట్టగా అది అతడి చాట్ నుంచి మాత్రమే డిలీట్ అయింది. సదరు న్యాయవాది ఫోన్లో మాత్రం అలాగే ఉండగా.. వెంటనే టామ్‌రాస్ ఆమెకు ఫోన్ చేశారు. తన ప్రియురాలికి పంపాల్సిన ఓ వీడియోను పొరపాటున మీకు పంపానని చెప్పారు. చూడకుండానే డిలీట్ చేయమని కోరారు. కానీ అప్పటికే ఆమె వీడయో చూడగా తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆయన కావాలనే పంపారునుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.
ఈక్రమంలోనే మేయర్ టామ్‌రాస్‌ను విచారించగా.. తన ప్రియురాలికి పంపాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీశానని చెప్పారు. అయితే తన ప్రియురాలి పేరు, న్యాయవాది పేరు ఒకే అక్షరంతో ప్రారంభం అయిందని.. అందులోనూ తనకు ఐఫోన్ వాడడం తెలియక పోవడం వల్లే ఈ పొరపాటు జరిగిందని వెల్లడించారు.
కానీ సదరు న్యాయవాది మాత్రం ఆ వీడియో పంపడానికి ఐదు నిమిషాల ముందే ఆయన తనకు ఫోన్ చేశారని.. ఓ కేసు గురించి మాట్లాడరని చెప్పుకొచ్చారు. ఈ వీడియో చూసిన తర్వాత తాను అతడి కలిసి పని చేయలేనని.. విధుల్లో నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో చేసేదేమీ లేక నగర మేయర్ టామ్‌రాస్.. తన తప్పుకు బాధ్యత వహిస్తున్నట్లు వివరించారు. తన మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Yuzvendra Chahal - RJ Mahvash: ఆమెకు మనసిచ్చేసిన చాహల్.. ఒక్క లైక్‌తో దొరికేసాడుగా!
Also Read: Kodali Nani: మరో నెల రోజులపాటు ముంబైలోనే కొడాలి నాని.. టెన్షన్‌లో అభిమానులు!
america | mayor | resign | video | mistake | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates