/rtv/media/media_files/2025/11/09/asim-munir-2025-11-09-16-31-51.jpg)
Pak Amends Constitution, Gives Asim Munir Key Role After Op Sindoor Drubbing
మధ్యవర్తిగా ఉండేవారిపై ఇరువర్గాలకు అనుమానమే.. ఇరాన్- అమెరికా యుద్ధంలో శాంతి చర్చలు చేస్తున్న పాకిస్తాన్ ఇరు దేశాలను సమానంగా చూస్తోందా.. అంటే దానికి సమాధానమే లేదు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌పై అమెరికాకు ఇప్పుడు అనుమానం వస్తోంది. ఆయన అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయనను తన "అత్యంత ఇష్టమైన ఫీల్డ్ మార్షల్" అని బహిరంగంగా ప్రశంసిస్తుండగా, మరోవైపు అమెరికా జాతీయ భద్రతా వర్గాల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మునీర్‌కు ఇరాన్ సైనిక నాయకత్వంతో ఉన్న సన్నిహిత సంబంధాలే ఈ కలవరానికి ప్రధాన కారణం. శాంతి చర్చల పేరుతో మునీర్ ఎవరికి ఫేవర్ చేస్తున్నాడో అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెరవెనుక మధ్యవర్తిత్వం.. వ్యూహాత్మక ముప్పు?
అమెరికా నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. వాషింగ్టన్, టెహ్రాన్ (ఇరాన్) మధ్య ఓ రహస్య మధ్యవర్తిగా మునీర్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని కీలక వ్యక్తులతో ఆయనకు దశాబ్దాలుగా ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విశ్రాంత పాకిస్తానీ జనరల్ అహ్మద్ సయీద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. దివంగత ఇరాన్ కమాండర్ ఖాస్సెమ్ సోలేమానీ, ప్రస్తుత ఐఆర్‌జిసి కమాండర్ హుస్సేన్ సలామీలతో మునీర్‌కు స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. అమెరికాకు బద్ధశత్రువులైన ఇరాన్ సైనిక వేత్తలతో ఇంతటి సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి, దౌత్యపరంగా అమెరికా ప్రయోజనాలను ఎంతవరకు కాపాడగలరనేది ఇప్పుడు సవాలుగా మారింది. అందుకే శాంతి చర్చల్లో మునీర్ మాట వినొద్దని అమెరికా నిఘా వర్గాలు ప్రతినిధులకు చెబుతున్నాయంట.
గతంలో ఆఫ్ఘనిస్తాన్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ అనుసరించిన ద్వంద్వ నీతిని అమెరికా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఒకవైపు అమెరికా నుండి భారీగా ఆర్థిక సాయం పొందుతూనే, మరోవైపు తాలిబన్లకు సహకరించిన చరిత్ర ఇస్లామాబాద్‌కు ఉందని వారు హెచ్చరిస్తున్నారు. "పాకిస్తాన్ గత ప్రవర్తనను మర్చిపోకూడదు. అమెరికా-ఇరాన్ వ్యవహారాల్లో ఇస్లామాబాద్ మధ్యవర్తిత్వం వహించడం వల్ల అమెరికాకు మేలు జరుగుతుందని భావించడం భ్రమ కావచ్చు." అని బిల్ రోగియో (FDD సీనియర్ ఫెలో) అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ఆత్మీయత vs భద్రతా ఆందోళనలు
అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగతంగా మునీర్‌ను ఇష్టపడుతుండటం ఒక ఎత్తైతే, నిఘా వర్గాల హెచ్చరికలు మరో ఎత్తు. ఇరాన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్న నాయకుడిని నమ్మడం వ్యూహాత్మక భారంగా మారుతుందని భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, జనరల్ మునీర్ ఒక 'దౌత్య వారధి'గా నిలుస్తారా లేక అమెరికా ప్రయోజనాలకు 'ముప్పు'గా మారుతారా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికి మాత్రం, ట్రంప్ చూపుతున్న ఆత్మీయతకు, నిఘా వర్గాల హెచ్చరికలకు మధ్య యుద్ధమే నడుస్తోంది.
Follow Us