Uk Visa Prices:మరింత  పెరగబోతున్న యూకే వీసా ఛార్జీలు

యూకే మరింత ఖరీదైన దేశంగా మారిపోతోంది. ముఖ్యంగా ఆ దేశాన్ని సూచేందుకు వెళ్లాలన్నా, చదువుకునేందుకు వెళ్లాలనుకున్నా మరింత భారం పడబోతుంది. స్టూడెంట్ సహా పర్యటకులతో పాటు అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.

New Update
Visa

Visa Photograph: (Visa)

బ్రిటన్ భారతీయులకు మరింత ఖరీదైనదిగా మారబోతుంది. ముఖ్యంగా అక్కడికి వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులకు, పర్యటకులు, బిజినెస్ చేయాలనుకునే వాళ్లకు వీసా ఫీజులను మరింతగా పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. అయితే ఈ పెరిగిన ధరలను ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. 

Also Read: Wife Attacks Husband: పోలీసుస్టేషన్‌ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ ఛాంపియన్!

పర్యటకులతో పాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వచ్చే విద్యార్థులు సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు యూకే ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా భారతీయులు యూకేలో అడుగు పెట్టాలంటే వీసా తప్పనిసరి కాగా.. ధరల పెంపుతో మరింత భారం పడనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఆరు నెలల గడువు గల వీసాకు గతంలో 115 పౌండ్ల ఫీజు ఉండగా.. దాన్ని 10 శాతం పెంచారు. అంటే ఇప్పుడు ఈ వీసా ఫీజు 127 పౌండ్లకు చేరింది.

Also Read: VIDEO VIRAL: తెలంగాణలో ఘోరం.. చెరుకు రసం మిషన్లో ఇరుక్కుకున్న మహిళ జుట్టు

కేవలం ఆరు నెలల గడువు వీసా ఫీజు మాత్రమే కాకుండా 2 సంవత్సరాల కాల పరిమితి వీసా రుసుమును కూడా పెంచినట్లు తెలుస్తుంది. రెండు, ఐదు, పదేళ్ల దీర్ఘకాలిక సందర్శన వీసాల రుసుములు వరుసగా.. 475 పౌండ్లు, 848 పౌండ్లు, 1059 పౌండ్లకు చేరబోతున్నాయి. డైరెక్ట్ ఎయిర్ సైడ్ ట్రాన్సిట్ వీసా రుసుము 39 పౌండ్లకు పెరిగింది. అలాగే ల్యాండ్ సైడ్ ట్రాన్సిట్ వీసా ధర 70 పౌండ్లకు చేరనుంది. అలాగే యూకే సందర్శించడానికి వీసా అవసరం లేని జాతీయులకు అవసరమైన ఈటీఏ రుసము 60 శాతం పెరిగి 16 పౌండ్లకు చేరుకుంది.

అలాగే ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 490 పౌండ్లు చెల్లించాల్సి ఉండగా.. దాన్ని 524 పౌండ్లకు పెంచారు. అలాగే చైల్డ్ స్టూడెంట్‌లకు ఇదే పెంపును వర్తింపజేస్తున్నట్లు ప్రకటనలో వివరించారు. అలాగే ఏదైనా కోర్సు నేర్చుకునేందుకు వెళ్లిన విద్యార్థులకు 6 నెలల నుంచి 11 నెలల స్వల్ప కాల పరిమితి ఫీజును కూడా 9 శాతం పెంచారు. గతంలో ఈ వీసా కోసం 200 పౌండ్లు చెల్లించాల్సి ఉండగా.. ఇప్పుడు 214 పౌండ్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వీటిని ఏప్రిల్ 9వ తేదీ నుంచి అమలు చేయబోతున్నారు.

Also Read: Canada-Bharat: మా ఎన్నికల్లో జోక్యానికి భారత్‌ ప్రయత్నిస్తుందంటూ...కెనడా గూఢచారి సంస్థ సంచలన ఆరోపణలు!

Also Read: Banking New Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!

uk | visa | fee | price | increase | telugu-news | latest-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America -Britan:ట్రంప్‌ తో ప్రపంచీకరణ ముగిసినట్లే!

అమెరికా ఫస్ట్‌ నినాదంతో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచ దేశాల పై భారీగా పన్నులు విధించిన విషయం తెలిసిందే. ఆయన చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టారని బ్రిటన్‌ ప్రధాని మంత్రి కీర్‌ స్టార్మర్‌ ఇటీవల పేర్కొన్నారు.

New Update
keir

keir

అమెరికాఫస్ట్‌ నినాదంతో అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచ దేశాల పై భారీగా పన్నులు విధించిన విషయం తెలిసిందే. ఆయన చర్యలతో అంతర్జాతీయ మార్కెట్లను అనిశ్చితిలోకి నెట్టారని బ్రిటన్‌ ప్రధాని మంత్రి కీర్‌ స్టార్మర్‌ ఇటీవల పేర్కొన్నారు. 1991లో సోవియట్‌ యూనియన్ పతనంతో ప్రారంభమైన ప్రపంచీకరణ ఇక్కడితో ముగిసిపోయిందని ఆయన సోమవారం ప్రకటించాలనుకుంటున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థల కథనాలు వెల్లడిస్తున్నాయి. 

Also Read:  Israel-Uk:యూకే ఎంపీలను నిర్బంధించిన ఇజ్రాయెల్‌!

టైమ్స్‌ నివేదిక ప్రకారం..ఆర్థిక జాతీయ వాదం విషయంలో అమెరికా తీసుకుంటున్న చర్యలను స్టార్మర్‌ కూడా అంగీకరించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త యుగం ప్రారంభమైయ్యిందని అమెరికా అధ్యక్షుడి విధానాన్ని అందులోని వారు సమర్థిస్తున్నారని ఆయన గుర్తించారు. ప్రపంచీకరణ చాలా మంది శ్రామికలకు అనుకూలంగా ఉండదన్నారు. దీనికి వాణిజ్య యుద్ధాలు సమాధానం అని మేము నమ్మడం లేదని అనుకున్నారు.

Also Read: Sri Rama Navami 2025: నవమి రోజే సీతారాముల కల్యాణం ఎందుకు చేస్తారో... తెలుసా!

ప్రత్యామ్నాయం చూపేందుకు ఇదొక అవకాశంగా స్టార్మర్‌ ఇటీవల అభివర్ణించడం గమనార్హం. వాణిజ్య అడ్డంకులను తొలగించడానికి ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల పోటీ పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి అనుగుణంగా ప్రపంచ దేశాలు తమ ఉత్పాదకతను పెంచడానికి కృషి చేస్తాయన్నారు.  గత నెల హాంకాంగ్‌ లో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో హెచ్‌ఎస్‌బీసీ చీఫ్‌ సర్‌ మార్క్‌ టక్కర్‌ అమెరికా అనుసరిస్తున్న పన్నుల విధానం పై  ప్రసంగించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు,ట్రంప్‌ వాణిజ్య విధానాలతో అంతర్జాతీయ సమాజం మొత్తం చిన్న ప్రాంతీయ బ్లాక్‌ లు క్లస్టర్లుగా విడిపోయే ప్రమాదం ఉందన్నారు.భవిష్యత్తులో వాటి మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు నెలకొనే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఈ క్రమంలో స్టార్మర్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

Also Read:Vontimitta Kodandarama Swamy Temple: హనుమంతుడి లేని రామాలయం..మన దగ్గరే..ఎన్నో ప్రత్యేకతలు!

Also Read: Kerala: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

keir-starmer | america | trump | britan | prime-minister | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment