Illegal Indian Immigrants: అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఇండియన్స్‌ను ట్రంప్(Trump) మెడ పట్టుకొని గెంటేస్తున్నాడు. పౌర విమానాల్లో వెళ్లే దానికంటే 5 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా ట్రంప్ ఏమాత్రం వెనకాడట్లే. అక్రమ వలసదారులను ఎమర్జెన్సీ లెక్కన మిలిటరీ ఫ్లైట్‌లో తీసుకొచ్చి ఇండియాలో వదిలేస్తున్నారు. అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేందుకు అమెరికా రక్షణ శాఖ సీ-17, సీ-130ఈ రెండూ మిలిటరీ విమానాలను ఉపయోగిస్తోంది. అయితే సీ-17(C-17) విమాన నిర్వహణ ఖర్చు గంటకు 21 వేల డాలర్లు. అలాగే సీ-130(C-130)ఈ విమానానికి గంటకు 68 వేల నుంచి 71 వేల డాలర్లు ఖర్చు అవుతుందట. అమెరిక ఎయిర్ ఫోర్స్ డెవలప్‌చేసిన విమానాలే సీ-17, సీ-130, ఇవి చాలా దేశాలకు ఎగుమతి చేసింది. ఇండియాకు కూడా అమెరికా ఆర్మీ ఫ్లైట్స్ అమ్మింది.
Also Read: కుల గణన సర్వేపై నెక్స్ట్ స్టెప్ ఇదే.. మంత్రి ఉత్తమ్ సంచలన ప్రకటన!
పంజాబ్ చేరుకున్న అమెరికా అక్రమ వలసదారులు
A first batch of 205 illegal Indian immigrants in United States are en route to India on board US Air Force C-17 military aircraft, sources said. It will reach India in 24 hours. This is the farthest destination for this aircraft. pic.twitter.com/8nGRfGN8yg
— Seema Hakhu Kachru (@Seemahkachru) February 4, 2025
సీ-17 ఆర్మీ విమానంలో 104 మందిని అమెరికాలోని టెక్సాస్ నుంచి ఇండియా పంపించారు అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు. వారు పంజాబ్‌లోని అమృత్‌సర్ ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. వీరిలో 30 మంది పంజాబ్, 33 మంది హర్యాణా, 33 మంది గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన చేరో ముగ్గురు, చండీఘర్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. వారికి సంకెళ్లు వేసి విమానంలో కూర్చోబెట్టారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 205 మంది అక్రమవలసదారులను తొలివిడత అమెరికా ఇండియాకు పంపిస్తోందని వార్తలు వచ్చాయి. కానీ.. అధికారికంగా మాత్రం ఆ సంఖ్య అమెరికా దృవీకరించలేదు.
Also Read: అమెరికా నుంచి అక్రమ వలసదారులు ఔట్.. అమృత్‌సర్‌లో ల్యాండ్ అయిన విమానం
2వేల మంది జైళ్లో.. 17వేల మంది ఇండియాకు
అమెరికాలోని హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం.. 20, 407 మంది భారతీయుల దగ్గర అమెరికాలో నివసించడానికి కావాల్సిన సరైన డాక్యుమెంట్స్ లేవని గుర్తించారు. అందులో 17,940 మందిని తిరిగి ఇండియా పెంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్భందంలో ఉన్నారు. ఈ ధరలు అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నడిపించే చార్టర్ ఫ్లైట్ టికెట్ల ధరల కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం. ఇలా సీ-17 విమానానికి ఒక రోజుకు అంటే 24 గంటలకు 5.04 లక్షల డాలర్లు అవుతుండగా.. సీ-130ఈ కి 16.32 లక్షల డాలర్ల నుంచి 17.04 లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది.
Also Read : పాపం పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు..ఎంతకు తెగించార్రా!
టెక్సాస్ నుంచి C-17లో..
సీ-17 విమానం ద్వారా ఈరోజు మొత్తంగా 104 మంది భారతీయులను అమెరికా సర్కారు ఇండియాకి తరలిస్తోంది. అయితే దీని ప్రయాణ సమయం 24 గంటలు కాగా.. ఒక్కో వ్యక్తిపై యూఎస్ 5.04 లక్షలు ఖర్చు చేస్తోంది. ఇలా 205 మందికి గాను 10 కోట్ల 32 లక్షల 20 వేల డాలర్లు ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా గ్వాటెమాలాకు పంపించేందుకు ఒక్కో వ్యక్తి 4675 డాలర్లు ఖర్చు కాగా.. సాధారణ టికెట్ ధర 853 డాలర్లు మాత్రమే. దీనితో పోలిస్తే గ్వాటెమాలాకు వెళ్లేందుకు ఒక్కో వ్యక్తికి సాధారణ విమాన ధరతో పోలిస్తే ఐదు రెట్లు ఎక్కువ. ఈ ధరలు అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ నడిపించే చార్టర్ ఫ్లైట్ టికెట్ల ధరల కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం.