/rtv/media/media_files/2025/02/16/6uvteTUuHgGFZjBeBLT8.jpg)
Elon Musk with trump Photograph: (Elon Musk with trump)
ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే.ఉద్యోగులందరూ గతవారం ఏం పని చేశారో వివరించాలని ఆదేశించారు. ఇందుకు సోమవారం అర్థరాత్రి వరకు గడువు విధించారు.
మరికొన్ని గంటల్లో ఆ గడువు ముగియనున్న వేళ తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దీని పై స్పందిస్తూ మస్క్ డిమాండ్ ను సమర్థించారు. మరో వైపు కీలక విభాగాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఫెడరల్ ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. ఫెడరల్ ఉద్యోగులకు యూఎస్ ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ నుంచి మస్క్ ఓ మెయిల్ పంపారు.
Also Read: Virat Kohli: అదే నా వీక్ నెస్ అయ్యింది.. కోహ్లీ బయటపెట్టిన భావాలు!
ఉద్యోగులందరూ గతవారం ప్రభుత్వం కోసం తాము ఏం పని చేశారో వివరించాలని అలా చేయలేని పక్షంలో వారు తమ పదవులకు రాజీనామా ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మెయిల్ కు సోమవారం రాత్రి 11.59 గంటల్లోపు..5 వాక్యాల్లో ఉద్యోగులు ప్రత్యుత్తరం ఇవ్వాలని ఆదేశించారు.
దీంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. అటు మస్క్ నిర్ణయం రిపబ్లికన్లలోనే కొంతమందికి నచ్చలేదు.దీని వల్ల దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారం బయటకు వెళ్లే ప్రమాదం ఉందనే భయాలు నెలకొన్నాయి. ఈ పరిణామాల వేళ ట్రంప్ దీనిపై మాట్లాడారు.
Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశి వారికి అన్ని శుభవార్తలే ..కానీ ..!
నిజంగా పని చేస్తున్నారా...
మస్క్ ఏం చేస్తున్నాడంటే..మీరు నిజంగా పని చేస్తున్నారా? అని అడుగుతున్నారు.ఒకవేళ మీరు దీనికి బదులివ్వకపోతే మిమ్మల్ని పాక్షికంగా లేదా పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించినట్లే . చాలా మంది సమాధానమిచ్చేందుకు ఇష్టపడట్లేదు. ఎందుకంటే వారు అసలు ఉనికిలోనే లేరు. మస్క్ నేతృత్వంలోని డోజ్..ప్రభుత్వంలో వందల బిలియన్ డాలర్ల మేర జరుగుతున్న మోసాన్ని గుర్తించింది.
గతంలో విధుల్లో లేనివారికి కూడా జీతాలు ఇచ్చినట్లు తెలిపింది. అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అయితే మస్క్ గడువును కొన్ని కీలక ఫెడరల్ విభాగాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయన ఆదేశాలకు స్పందించాల్సిన అవసరం లేదని ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్, తులసీ గబ్బార్డ్ సహా పలువురు తమ విభాగాల్లోని ఉద్యోగులకు సూచించారు.
Also Read: Sashi Tharoor: నా అవసరం పార్టీకి లేకపోతే చెప్పేయండి: శశి థరూర్!
అటు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ కూడా దీని పై స్పందించినట్లు తెలుసత్ఓంది.మస్క్ మెయిల్ కు రిప్లై ఇవ్వనంత మాత్రాన ఎవరినీ ఉద్యోగాల్లో నుంచి తొలగించబోం.దీని పై నిర్ణయం మీ ఇష్టపూర్వకమే అని విభాగానికి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి.
తాజా పరిణామాల పై మస్క్ కూడా స్పందించారు. సోమవారం అర్థరాత్రి లోపు రిప్లై ఇవ్వనివారికి రెండో అవకాశమిస్తానని వెల్లడించారు. అప్పుడు కూడా బదులివ్వకపోతే ఉద్యోగాల నుంచి తొలగించడం తప్పదని స్పష్టం చేశారు.
Also Read: Anand Mahindra: ఒబెసిటీ పై పోరు..ఆనంద్ మహీంద్రా నామినేట్ చేసింది వీరినే!