/rtv/media/media_files/2025/01/22/TCUTm10W3mt5Zc1nkVOm.jpg)
trump putin
America-Trump-Russia: అమెరికా -రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని వ్లాదిమిర్ పుతిన్ , డొనాల్డ్ ట్రంప్ లు కోరుకుంటున్నారని రష్యా వెల్లడించింది. ఈ విషయాన్ని పునరుద్ధరణ, ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం తదితర అంశాల పై సౌదీ అరేబియా వేదికగా ఇరు దేశాల నేతలు భేటీ కానున్న నేపథ్యంలో లావ్రోవ్ ఈ విధంగా స్పందించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ట్రంప్ ఇటీవల ఫోన్ లో మాట్లాడిన విషయాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గుర్తు చేశారు. ఇరు దేశాల మధ్య క్షీణించిన సంబంధాల పై వారు మాట్లాడారని, వాటి పునరుద్ధరణ కోసం ఇరు దేశాధ్యక్షులు చర్చలు జరిపేందుకు అంగీకరించారని చెప్పారు.
శాంతి చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు..!
ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా-రష్యా మధ్య సంబంధాలు ఊహించని స్థాయిలో పతనమైన విషయం తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో రష్యా (Russia) అధ్యక్షుడితోనూ చర్చలకు సిద్ధమయ్యారు.
ఇప్పటికే ఫోన్ లో మాట్లాడిన ఆయన..సౌదీ అరేబియాలో శాంతి చర్చలుంటాయని వెల్లడించారు. ఇందులో ట్రంప్ -పుతిన్ లు నేరుగా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియా పర్యటనలో భాగంగా ఇప్పటికే యూఏఈ చేరుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఈ శాంతి చర్చల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Samsung Upcoming Smartphone: సామ్‌సంగ్ ఫోన్ల జాతర.. మార్కెట్‌లోకి రానున్న మొబైల్స్ ఇవే!