North Korea: జపాన్‌పై ఉత్తరకొరియా దాడి.. 10 మిసైళ్లతో ఎటాక్

శనివారం ఉత్తర కొరియా తీర్పు తీరం నుంచి జపాన్ సముద్రం వైపు10 బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించింది. దక్షిణ కొరియా సైన్యం, జపాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించాయి.

New Update
North Korea fires about 10 ballistic missiles amid US–South Korea drills

North Korea fires about 10 ballistic missiles amid US–South Korea drills

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత రెండు వారాలుగా అమెరికా-ఇజ్రాయెల్, ఇరామ్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర కొరియా(north-korea) కూడా యుద్ధానికి సిద్ధమవుతోంది. శనివారం ఉత్తర కొరియా తీర్పు తీరం నుంచి జపాన్ సముద్రం వైపు10 బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించింది. దక్షిణ కొరియా సైన్యం, జపాన్(japan) ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించాయి.  

Also Read: ఖర్గ్‌ ఐలాండ్‌పై దాడులు.. అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్‌

North Korea Fires About 10 Ballistic Missiles

ప్రస్తుతం దక్షిణ కొరియా(south-korea), అమెరికా కలిసి తమ వార్షిక సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఉతర కొరియా మిస్సైళ్లు ప్రయోగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా బాలిస్టిక్ ప్రొజెక్టైల్స్‌ ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్‌ ఆఫ్‌ స్టాప్ తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఆ క్షిపణులు సముద్రంలో పడిపోయినట్లు జపనీస్ కోస్ట్‌ గార్డ్ తెలిపింది. ఈ పరిస్థితులను నిశితంగా గమిస్తున్నామని జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఇదిలాఉండగా ఈ ఏడాది జనవరి 27న కూడా ఉత్తర కొరియా తూర్పు తీరం నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. తాజాగా మళ్లీ మిసైళ్లను ప్రయోగించడం చర్చనీయాంశమవుతోంది.  

Also Read: హర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ మార్గాలు.. కానీ ఇక్కడే సమస్యలు

Advertisment
తాజా కథనాలు