/rtv/media/media_files/2025/03/18/uTsV9lTKuY20AslfBpqi.jpg)
Missing Girl Sudeeksha
భారత సంతతికి చెందిన 20 ఏళ్ల యువతి.. తన కుటుంబంతో కలిసి అమెరికా (America) లో నివాసం ఉంటుంది. అక్కడ పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ (Pittsburgh University) లో గ్రాడ్యుయేషన్ చదువుతోంది. అయితే ఈమె గత వారం స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఎంజాయ్ చేస్తుండగా.. సడెన్‌గా కనిపించకుండా పోయింది. విషయం గుర్తించిన అధికారులు ఆమె కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Also Read : 30 సంవత్సరాల నుంచి పాములు కాటేస్తూనే ఉన్నాయి!
మరిన్ని వీడియోలు పరిశీలన..
సుదీక్ష కనిపించకుండా పోయి ఇప్పటికి పదిరోజులపైనే అవుతోంది ఇప్పటివరకు ఆమె జాడను కనుక్కోలేక పోయారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో ఆమె కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు.సుదీక్ష బీచ్‌లో కొట్టుకుపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. సముద్రంలో కూడా వెతికారు. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. దీంతో సుదీక్ష మిస్సింగ్ మిస్టరీగా మారింది. మార్చి 6న బీచ్ లో తిరుగుతుండగా హఠాత్తుగా మాయం అయింది. ఈ మిస్సింగ్ కు సంబంధించి అమెరికా, డొమనికన్ అధికారులు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ఆమెకు సంబంధించి మరిన్ని వీడియోలు పరిశీలించారు. ముందుగా సుదీక్ష ఆమె స్నేహితుడు జాషువా రీబేతో కలిసి వెళ్ళినట్లు గుర్తించారు. దాంతో అతనిని అరెస్ట్ చేసి విచారించారు. అయితే ఎంత అడిగినా జాషువా తనకు ఏమీ తెలియదనే చెబుతున్నాడు. ఇద్దరం కలిసి సముద్రంలో ఆడుకోవడానికి వెళ్ళడం నిజమేనని..అయితే ఒక పెద్ద అల రావడంతో సుదీక్ష, తాను కూడా ఉక్కిరి బిక్కిరయ్యామని చెప్పాడు. అలా అయిన తర్వాత తాను ఎలాగో ఒకలా తప్పించుకుని బయటకు వచ్చానని తెలిపాడు. అలా వచ్చిన తర్వాత తనకు పెద్ద వాంతి అయిందని...తరువాత అక్కడే ఒడ్డున నిద్రపోయానని తెలిపాడు. తెలివి వచ్చాక రిస్టార్ట్ కు వచ్చేశానని తెలిపాడు. సుదీక్ష ఏమైందో తనకు తెలియదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అధికారులు జాషువాను అబ్జర్వేషన్ లో ఉంచారు. ఇతని పాస్ పోర్ట్ కూడా జప్తు చేశారు.
Also Read : మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..200 మంది మృతి
ఇప్పుడు సుదీక్షకు సంబంధించిన మరికొన్ని వీడియోలు దొరికాయి. ఇందులో ఆమె జాషువా కాకుండా మరో విద్యార్థితో కలిపి మద్యం సేవిస్తున్నట్లు కనిపించింది. అతనితో చాలాసేపు ముచ్చట్లు పెట్టినట్టు, అతనికి మందు అందిస్తున్నట్టు కూడా కనిపించింది. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారు. సుదీక్ష అమెరికా పౌరురాలి కాబట్టి.. అమెరికా అధికారులు.. డొమినికన్ రిపబ్లిక్ అధికారులతో కలిసి సెర్చ్ చేస్తున్నారు. స్థానిక అధికారులు బీచ్ లో కొట్టుకుపోయుంటుందని తేల్చేసినా..అందుకు సుదీక్ష తల్లిదండ్రులు మాత్రం అంగీకరించడం లేదు. కచ్చితంగా తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బీచ్ లో కొట్టుకుపోయి ఉంటే ఈపాటికి శవమై కొట్టుకువచ్చేదని అంటున్నారు.
Also Read: Sunita Wiiliams: పట్టుదలకు చిరునామా, యువతకు స్ఫూర్తి సునీతా విలియమ్స్
Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి.. జర జాగ్రత్త!