/rtv/media/media_files/2025/02/07/aMYvJa5KW1lCW9ueX6CX.jpg)
Canada
ఉన్నత విద్య కోసం ఏటా ఎందరో భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. అయితే చదువుల కోసం దాదాపుగా 20 వేల మంది భారతీయ విద్యార్థులు (Indian Students) కెనడా వెళ్లిన వాళ్లు అక్కడ కళాశాలల్లో చేరలేదని ఇటీవల ఓ నివేదిక తెలిపింది. చదువుల కోసం వెళ్లిన వారంతా ఎక్కడున్నారనే విషయం కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన విద్యార్థుల్లో చాలా మంది అక్కడ ఖర్చులకు డబ్బులు సంపాదించుకోవడానికి పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొందరు విద్యార్థులు నకిలీ కళాశాలల చేతుల్లో మోసపోయారని, మరికొందరు స్టూడెంట్ వీసాను కావాలనే దుర్వినియోగం చేసినట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి.
#REPORT: Nearly 50,000 international students who were granted study permits to come to Canada didn’t show up at the colleges and universities where they were supposed to take their classes. pic.twitter.com/pwjEX5DckM
— 6ixBuzzTV (@6ixbuzztv) January 15, 2025
ఇది కూడా చూడండి: Telangana: సుప్రీం కోర్టు సంచలన తీర్పు..మొదటి పెళ్లి రద్దుకాకపోయినప్పటికీ కూడా రెండో భర్త భరణం ఇవ్వాల్సిందే
ముందుగా ట్యూషన్ ఫీజు చెల్లించక్కర్లేదని..
అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నట్లు కెనడా (Canada) లో కూడా అంతర్జాతీయ విద్యార్థులు ముందుగా ట్యూషన్ ఫీజు చెల్లించక్కర్లేదు. అందుకే చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గుజరాత్, పంజాబ్, హరియాణా, మహారాష్ట్రల నుంచి చాలా మంది విద్యార్థులు చదువుల కోసం కెనడా వెళ్లారు. కానీ అక్కడ క్లాస్‌లకు మాత్రం వెళ్లడం లేదు. డబ్బులు సంపాదించేందుకు మొబైల్ షాపు, గ్యాస్ స్టేషన్, డెలివరీ ఏజెంట్లుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులపై కేసు.. అసత్య ప్రచారం చేసినందుకేనా?
కొందరికి చదువుకోవాలని ఆసక్తి ఉన్నా కూడా మంచి యూనివర్సిటీలో అడ్మిషన్లు దొరక్కపోవడంతో అక్కడే పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ చేసుకుంటున్నారు. ఇలానే ఎందరో విద్యార్థులు మోసపోవడంతో ఇంకా ఏం చేయలేక డబ్బులు కోసం వర్క్ చేసుకుంటున్నారు. తెలంగాణకి చెందిన ఓ 26 ఏళ్ల విద్యార్థి కూడా ఇలానే కాలేజీ అడ్మిషన్ తీసుకున్నాడు. కానీ కాలేజీకి వెళ్లకుండా మొబైల్ షాపులో ఫుల్ టైమ్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ఉన్నారు. వాళ్లు ఎవరూ కూడా కెనడా నుంచి ఎక్కడికి పోలేదు.
ఇది కూడా చూడండి:America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్ గ్యాప్ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?
అక్కడ పనిచేసుకుంటూ.. శాశ్వత నివాసం కోరుతున్నారని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా కొందరు వెళ్తుంటారు. ఇలా వెళ్లిన వారిలో ఇండియా వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తూ.. పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కెనడా సరిహద్దుల నుంచి వెళ్లే వాళ్లు కొందరు ఉన్నారు. అలాగే వీషా కూడా ఇక్కడి నుంచి పెద్ద ప్రాబ్లమ్ ఉండదని కొందరు అంటున్నారు.
ఇది కూడా చూడండి: America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!