/rtv/media/media_files/2025/04/12/KD8GhuVpPB9U4CupUpuq.jpg)
NASA
చంద్రునిపై రహస్యాలు తెలుసుకునేందుకు చాలా దేశాలు ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాయి. గత 50 ఏళ్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రునిపైకి వ్యోమగాములను పంపుతూనే ఉంది. దీనివల్ల అక్కడ మానవ వ్యర్థాల కుప్ప పెరిగిపోయింది. ఈ క్రమంలోనే నాసా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వాటిని తొలగించేలా లేదా రీసైక్లింగ్ చేసేలా పరిష్కారం చూపితే 3 మిలియన్ డాలర్లు (రూ.25 కోట్లు) నజరానా అందిస్తామని చెప్పింది.
Also Read: రేయ్ పాపం రా.. 13 కుక్కలను రేప్ చేసిన దుర్మార్గుడు- లైవ్ వీడియో వైరల్?
NASA Offering $3 Million To Recycle 96 Bags
ఇక వివరాల్లోకి వెళ్తే 1969 నుంచి 1972 మధ్యకాలంలో అపోలో మిషన్ ద్వారా నాసా వ్యోమగాములను చంద్రుడిపై పరిశోధనల కోసం పంపించింది. ఆరుసార్లు విజయవంతగా మిషన్‌లు ల్యాండ్ అయ్యాయి. వ్యోమగాములు పరిశోధన కోసం చంద్రునిపై నుంచి శాంపిల్స్ కూడా తీసుకొచ్చారు. అయితే లూనారీ మాడ్యూల్‌లో నిల్వ ఉంచే స్థల పరిమితిని దృష్టిలో పెట్టుకొని ఆస్ట్రోనాట్స్ అనవసరమైన వస్తువులు బయటకు విసిరేసినట్లు నాసా తెలిపింది.
Also Read: అమెరికా టారిఫ్ ఎఫెక్ట్.. ఎగుమతి సవాళ్లు ఎదుర్కొంటున్న చైనా
అయితే చంద్రుడిపై మాత్రమే కాక అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాము వాడిన వస్తువులను రీసైక్లింగ్ చేసి మళ్లీ వినియోగిస్తుంటారు. కానీ అక్కడే ఉండే మానవ వ్యర్థాలను తొలగించాలన్న, వాటిని భూమిపైకి తీసుకురావాలన్న చాలా కష్టం. అందుకే ఈ సమస్య పరిష్కారానికై నాసా తాజాగా ఈ ప్రకటన చేసింది. భవిష్యత్తులో చంద్రునిపైకి మానవులను తీసుకెళ్లడం, అక్కడ వాళ్ల జీవన విధానాన్ని మెరుగుపర్చడంలో ఇప్పుడు ఎవరైనా ఐడియా ఇస్తే అది కీలకంగా మారుతుందని నాసా చెబుతోంది.
Also Read: మరో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
Also Read : వేసవిలో సపోటా తింటే ఎన్ని లాభాలో తెలుసా!
rtv-news | telugu-news | moon | nasa | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | Apollo astronauts