/rtv/media/media_files/2025/03/17/IqDCRq56mwp4Wad2MzdE.jpg)
sunita williams and butch wilmore
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గత తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు వాళ్లు భూమి మీదకు తిరిగిరానున్నారు. అయితే తాజాగా వాళ్లు భూమి మీదకి వచ్చే సమయాన్ని నాసా ప్రకటించింది. మరికొన్ని గంటల్లోనే వాళ్ల తిరుగుప్రయాణం మొదలుకానుంది. అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 PM గంటలకు వారు భూమి మీద ల్యాండ్ అవ్వనున్నారు.
Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు గత ఏడాది అంతరిక్ష కేంద్రానికి(ISS) వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. చివరికి స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ తాజాగా అక్కడికి వెళ్లి ఐఎస్‌ఎస్‌తో విజయవంతంగా అనుసంధానమైన సంగతి తెలిసిందే. దీంతో ఆ ఇద్దరు భూమి మీదకు వచ్చే మార్గం సుగమమైంది.
క్రూ డ్రాగన్‌లో నలుగురు వ్యోమగాములు నింగిలోకి పయనమయ్యారు. ఇందులో అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్స్ ఆన్ మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్, రష్యాకు చెందిన వ్యోమగామి కిరిల్ పెస్కోవ్, జపాన్‌కు చెందిన వ్యోమగామి టకుయా ఒనిషి ఉన్నారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు ఈ క్రూ డ్రాగన్ మిషన్‌లోనే భూమి మీదకి రానున్నారు. మరో ఇద్దరు వ్యోమగాములు వాళ్ల స్థానంలో ఐఎస్ఎస్‌లో విధులు నిర్వహించనున్నారు. మొత్తానికి ఎట్టకేలకు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు రానుండటంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
Also Read: యువతకు స్వయం ఉపాధి.. నేటి నుంచి రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు ప్రారంభం
జీతం ఎంతంటే ?
ఇక జీతం పరంగా చూస్తే నాసా ఉద్యోగులు.. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు పొందే జీతాన్నే పొందుతారు. అయితే వ్యోమగాములకు జనర్ షెడ్యూల్ జీఎస్-13 నుంచి జీఎస్-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు జీఎస్-15 గ్రేడ్ పే శాలరీ తీసుకుంటున్నారు. దీని ప్రకారం చూస్తే వార్షిక వేతనం 1,24,133 డాలర్ల నుంచి 1,62,672 డాలర్ల (రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్లు) మధ్య ఉంటుంది.