/rtv/media/media_files/2025/02/18/Rb087wXDD06L8K8e2vLr.jpg)
tesla
అమెరికాలో టెస్లా షోరూం (Tesla Showroom) పై మరోసారి దాడి జరిగింది. ఒరెగాన్ లోని షోరూమ్ పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో పలు వాహనాలు దెబ్బ తిన్నాయి. అయితే అదృష్ణం కొద్దీ ఎవరికీ హాని జరగలేదు. వారం వ్యవధిలో ఇదే టెస్లా షోరూమ్ పై ఇలా దాడులు జరగడం ఇది రెండోసారి.
Also Read: Donald Trump: మరో కీలక నిర్ణయం తీసుకున్న ట్రంప్..41 దేశాల పై ..!
ట్రంప్ (Donald Trump) ప్రభుత్వంలో మస్క్ (Elon Musk) కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆయన డోజ్ ఓవెల్ ఆఫీస్ లో అడుగుపెట్టారో..అప్పటి నుంచి ఆయన పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. డోజ్ చీఫ్ పేరిట ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు చర్యలతో ఆ వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన సీఈవో గా వ్యవహరిస్తున్న టెస్లా కంపెనీ లక్ష్యంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి.
Also Read: Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
Musk Tesla Oregon Showroom
మార్చి 6 వ తేదీన ఒరెగాన్ పోర్ట్ లాండ్ సబర్బ్ అయిన టిగార్డ్ లోని టెస్లా డీలర్ షిప్ పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి.కొలరాడో లవ్ ల్యాండ్ లోని షోరూమ్ పై ఓ మహిళ దాడి చేసి ధ్వంసం చేసింది. ఆ పై మస్క్ వ్యతిరేక రాతలు రాసి..బొమ్మలు గీసింది.
బోస్టన్ లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్ కు దుండగుల నిప్పు పెట్టారు. సియాటెల్ లో టెస్లా వాహనాలకు ఆగంతకులు మంట పెట్టారు. వాషింగ్టన్ లీన్‌వుడ్ లో టెస్లా సైబర్ ట్రక్కుల పై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలు రాశారు.
మార్చి 13 వ తేదీన..ఒరెగాన్ టిగార్డ్ షోరూం పై మరోసారి కాల్పులు..షోరూం ధ్వంసం చేసింది. వారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్ షోరూం పై దాడి జరిగింది.దీంతో ఎఫ్‌బీఐ ,ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరో వైపు టెస్లా పై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా అభివర్ణించిన ట్రంప్..ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్నారు.
ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగిస్తాయని..అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్ కంపెనీలు అందిస్తున్న సేవలు మరిచిపోకూడదని ట్రంప్ అంటున్నారు.
Also Read: putin -Ukrain: లొంగిపోండి..కనీసం ప్రాణాలతో అయిన ఉంటారు: పుతిన్!
Also Read: Trump-Putin: ఉక్రెయిన్ సైనికుల ప్రాణాలు కాపాడండి'- పుతిన్‌తో ట్రంప్ !