/rtv/media/media_files/2025/02/15/HrfNVVw9H1ozeMcsueyC.jpg)
sunita williams and butch wilmore
నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలయమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిపైకి వచ్చే ప్రయాణం ఖరారైన సంగతి తెలిసిందే. మార్చి 19న వాళ్లు భూమి మీదకు బయలుదేరనున్నారు. అయితే వాళ్లు ఇక్కడికి వచ్చాక పలు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ ఉన్న వాతావరణంలోకి వస్తే వారి శరీరంలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒక పెన్సిల్ లేపినా కూడా వర్కౌట్ చేసినట్లే ఉంటుందని స్వయంగా బుచ్ విల్మోరే చెప్పారు.
Also Read: మోనాలిసా రేంజ్ మారింది.. మాల్ ఓపెనింగ్ లో డాన్సులతో సందడి.. వీడియో చూశారా!
Sunita Williams Returns To Earth
'' గ్రావిటీలో ఉండటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. భూమిపై ఉండే పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుంది. శరీరమంతా కూడా భారంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక పెన్సిల్ ఎత్తినా కూడా వర్కవుట్‌తో సమానం అవుతుందని'' విల్మోర్ అన్నారు.
స్పేస్‌లో తెలియాడుతూ ఉండే ఆస్ట్రోనాట్స్ భూమి మీదకు వచ్చిన 24 గంటల్లో అలాంటి ప్రత్యేకమైన అనుభూతికి దూరమవుతుంటారు.
అంతేకాదు స్పేస్‌లో ఎక్కువ కాలం ఉంటే వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై కూడా ప్రభావం ఉంటుంది. ఒక ఆస్ట్రోనాట్ స్పేస్‌లోకి ప్రవేశించిన తర్వాత ఎక్కవ కాలం అక్కడ ఉంటే వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం ఉంటుంది.
Also Read : 2024 YR4: డేంజర్ జోన్‌లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!
ఆస్ట్రోనాట్ (Astronaut) స్పేస్‌లోకి ప్రవేశించిన వెంటనే వాళ్ల శరీరం స్పేస్ ఎనీమియాకు గురవుతుంది. ఎర్ర రక్తకణాలను నాశనం చేయడం వల్ల మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. అలాగే వ్యోమగామి శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో వాటి సంఖ్య తగ్గిపోతుంది. దీనివల్ల అలసటగా అనిపించడం, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. గుండె పనితీరు దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది.
Also Read: మోదీ మాటలకే పరిమితం.. AI విషయంలో ఫెయిల్: రాహుల్ గాంధీ
ఇదిలాఉండగా.. గత ఏడాది జూన్‌లో సునీతా, బుచ్ విల్మోర్‌లు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వాళ్లు వారంలోగా భూమిపైకి తిరిగి రావాల్సిఉంది. కానీ వారు వచ్చిన వ్యోమనౌకలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో గత ఎనిమిది నెలలుగా వాళ్లు ఐఎస్ఎస్‌లోనే ఉండిపోయారు. వచ్చే నెలలో స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో వాళ్లు భూమి మీదకు రానున్నారు.
Also Read : రేపటినుంచి పెద్దగట్టు జాతర...ఎలా వెళ్లాలో తెలుసా?