/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Biden-2-jpg.webp)
biden
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ (Joe Biden) పదవీకాలం మరికొన్ని గంటల్లో ముగుస్తుంది. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయన సోమవారం రాత్రి 10.30 గంటలకు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి అధ్యక్షుడు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశాధ్యక్షుడిగా తన చివరి రోజున జో బైడెన్ ఎక్కడ ఉన్నారు, ఏ చేస్తున్నారంటే..తన పదవీకాలంలో చివరి రోజైన ఆదివారమంతా జో బైడెన్ దక్షిణ కరోలినాలో గడిపినట్లు తెలుస్తుంది.
Also Read: Mukesh AMbani: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు విందులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ దంపతులు
2020లో డెమోక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచే బైడెన్ గెలిచిన విషయం తెలిసిందే. అక్కడ ప్రారంభమైన ఆయన ప్రస్థానం వైట్‌హౌస్‌కు చేరుకుంది. పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆదివారం ఆయన అక్కడికి చేరుకున్నారు. వీడ్కోలు ప్రసంగం కూడా అక్కడే చేయనున్నారు. భార్య జిల్ బైడెన్‌తో కలిసి రాయల్ మిషనరీ బాప్టిస్ట్ చర్చిని సందర్శించి మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ గురించి మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి.
అదేవిధంగా ఇంటర్నేషనల్ ఆఫ్రికన్ అమెరికన్ మ్యూజియాన్ని కూడా సందర్శిస్తారని తెలుస్తుంది. గతంలో తన విజయానికి కారణమైన వారికి అక్కడి నుంచి ధన్యవాదాలు తెలియజేయనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
మరోవైపు అమెరికా 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణస్వీకార కార్యక్రమానికి అంతా రెడీ అయ్యింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న క్యాపిటల్ హిల్‌లోని రోటుండా ఇండోర్ ఆవరణలో సోమవారం ట్రంప్ ప్రమాణం చేయబోతున్నారు. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10.30 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతుంది.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారు సంఘంలో కీర్తి ప్రతిష్ఠ పొందుతారు..అంతే కాకుండా..