Iran: హర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం.. ఇరాన్‌ సంచలన వార్నింగ్‌

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన ఇరాన్‌కు మళ్లీ కోపం తెప్పించింది. హర్మూజ్‌ను తెరిచినప్పటికీ ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం ఉంటుందని ట్రంప్ తెలిపారు. అయితే ఈ దిగ్బంధనం కొనసాగితే మళ్లీ హర్మూజ్‌ను మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.  

New Update
Hormuz Won’t Remain Open, Iran Warns After Trump Says US Naval Blockade Will Continue

Hormuz Won’t Remain Open, Iran Warns After Trump Says US Naval Blockade Will Continue

హర్మూజ్‌ జలసంధిని తెరిచినట్లు ఇరాన్(iran) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనివల్ల వాణిజ్య నౌకల రవాణాకు అంతరాయం తొలగిపోతుందని అందరు అనుకున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(Donald Trump) చేసిన ప్రకటన ఇరాన్‌కు మళ్లీ కోపం తెప్పించింది. హర్మూజ్‌ను తెరిచినప్పటికీ ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం ఉంటుందని ట్రంప్ తెలిపారు. అయితే ఈ దిగ్బంధనం కొనసాగితే మళ్లీ హర్మూజ్‌ను మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.  

Also read:  ట్రంప్ పర్యటనలో కనిపించిన ఈ మిస్టరీ ఉమెన్ ఎవరు?

Hormuz Won’t Remain Open - Iran Warning

ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్‌ ఎక్స్‌లో దీనికి సంబంధించి పోస్టు చేశారు. హర్మూజ్ జలసంధి, శాంతిఒప్పందం, ఇతర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే ఏకంగా 7 పోస్టులు చేసినట్లు తెలిపారు. ఇవన్నీ అబద్ధాలేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలపై ముందుకు వెళ్తుండగా ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడాన్ని ఇరాన్ అంగీకరించదని తేల్చిచెప్పారు. అబద్ధాలు చెప్పి యుద్ధం గెలవలేరని.. చర్చల్లో కూడా ఎలాంటి పురోగతి సాధించలేరంటూ విమర్శించారు. 

Also Read: మధ్యప్రాచ్యంలో ట్రంప్ బిగ్ ట్విస్ట్.. సిరియా నుండి అమెరికా సేనల ఉపసంహరణ!

హర్మూజ్‌(Hormuz) పై అమెరికా దిగ్బంధనం ఇలాగే కొనసాగితే దాన్ని మళ్లీ మూసివేస్తామని ఘాలిబఫ్‌ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలాఉండగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య రెండోసారి చర్చలు జరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హర్మూజ్‌ అంశంపై మళ్లీ ఇరుదేశాల మధ్య వాగ్వాదం జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisment
తాజా కథనాలు