అదానీ కంపెనీ అవినీతి మయం అనే ఆరోపణలతో సంచలనం సృష్టించిన ష్టార్ట్ సెల్లర్ కంపెనీ హెండెన్ని బర్గ్‌ను మూసేస్తున్నామని దీని ఫౌండర్ నాట్ ఆండర్సన్ సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి ఒక లేఖను విడుదల చేశారు. దీని వెనుక ఎలాంటి భయాలు, వ్యక్తిగత విషయాలు, అనారోగ్య కారణాలు లేవని చెప్పారు. 2017లో హిండెన్ బర్గ్‌ను స్థాపించారు ఆండర్సన్.
Also Read : వావ్.. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ టిక్కెట్లు.. మరీ ఇంత చీపా!
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ v. అదానీ గ్రూప్
2023 సంవత్సరం ప్రారంభంలో, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) అదానీ గ్రూప్ (Adani Group) కు షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రెండో స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ.. ఈ నివేదిక తర్వాత ఒక్కసారిగా తన సంపదను కోల్పోయాడు. అదానీ గ్రూప్ తమ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచడంతోపాటు అనేక అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్‌లో ఆరోపణలు వెల్లువెత్తాయి.దీంతో నిలువునా దూసుకుపోతున్న అదానీ షేర్లు అదే బాటలో పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలను కోల్పోయారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. సెబీ విచారణ పూర్తి చేయాల్సి ఉంది.
Also Read: AP: ఓ పక్కన నిలబడి కోట్లు కొల్లగొట్టిన పందెం కోడి
Also Read: Russia: పోలాండ్ సరిహద్దుల్లో రష్యా భీకర దాడి..
అదానీ గ్రూప్ పై ఆరోపణలతో సచలనం సృష్టించింది హిండెన్ బర్గ్ రిసెర్చ్ కంపెనీ. వరుసగా రెండు సార్లు అదానీ కంపెనీల అవిఈతిని బయటపెట్టింది. స్టాక్స్ మానిపులేషన్, అకౌంటింగ్ మోసాలు చేశారని...దాని వలన బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లందంటూ అదానీపై నేరారపణ చేసింది. అదానీని వెనుక బలమైన శక్తులు ఉన్నాయని...వారే అతనని కాపాడుతున్నారని చెప్పింది. అప్పట్లో ఇది పెద్ద సంచలనం రేపింది. ఒక్కసారిగా అదానీ కంపెనీల మూలాలన్నీ కదిలాయి. అతనికి వేల కోట్ల నష్టం వచ్చింది. తరువాత మళ్ళ ఇంకోసారి అదానీ లంచాలు ఇచ్చారంటూ హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఇచ్చింది. దీని అనుగుణంగా యూఎస్‌ఏలో కేసు కూడా నమోదు అయింది. దీంతో హిండెన్ బర్గ్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. అప్పటివరకు అదొకట ఉందని కూడా చాలా మందికి తెలియదు. అదానీ వ్యవహారంతో ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో హిండెన్ బర్గ్ గురించి అందరికీ తెలిసింది.
Also Read: USA: ఆ లోపు వచ్చేయండి.. హెచ్1–బి వీసాదారులకు కంపెనీల సూచన