ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు హిందూ సంప్రదాయంలో ఓ ప్రత్యేకత ఉంది. ఎంతో ఘనంగా ఈ మహా కుంభమేళాను నిర్వహిస్తారు. అయితే ఈ మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌లోని 'సంగం' ఒడ్డున జరగనున్న కుంభమేళాకు లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ కుంభమేళాకు యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ మహా కుంభమేళాకు వచ్చి దాదాపుగా రెండు వారాల పాటు తపస్సు చేయనున్నట్లు సమాచారం. లారెన్ పావెల్ జనవరి 13న కుంభమేళాకు రానున్నారు. అక్కడ నిరంజనీ అఖారాలోని మహమ్నాద్లేశ్వర్ స్వామి కలియశానంద శిబిరంలో బస చేయనున్నారు. BIG BREAKING NEWS 🚨 Apple Co-Founder Steve Jobs's Wife will do penance for 2 weeks as a Sadhvi in Maha Kumbh!Laurene Powell Jobs will reach Prayagraj to participate in the Maha Kumbh.She will stay in a Akhara to learn more about Sanatan Dharma.She will attend bhajan and… pic.twitter.com/kvP473ZRkq — Times Algebra (@TimesAlgebraIND) January 10, 2025 లారెన్ పావెల్ ఎవరు ? ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో లారెన్ పావెల్ ఒకరు. ఆమె ఆస్తి 15 బిలియన్ల డాలర్లు. స్టీవ్ జాబ్స్ భార్య అయిన లారెన్ పావెల్ యాపిల్ కంపెనీ షేర్స్ నుంచి ఆస్తిని వారసత్వంగా పొందారు. 2021లో ఆమె వేవెర్లీ స్ట్రీట్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. దీనికి వచ్చే నిధులను పర్యావరణ మార్పులను పరిష్కరించేందుకు కేటాయిస్తున్నారు. అయితే ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళకు లారెన్ పావెల్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీన్ని బట్టిచూస్తే ఆధ్యాత్మికతకు ఎలాంటి సరిహద్దులు ఉండవనే విధానాన్ని ప్రతిబింబిస్తుంది. Also Read: నేనూ మనిషినే తప్పులు చేస్తాను దేవుడిని కాదు–ప్రధాని మోదీ ఇదిలాఉండగా.. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి ప్రపంచవ్యా్ప్తంగా దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించడం కోసం 1.6 లక్షల టెంట్లు, అలాగే 1.5 లక్షల మరుగుదోడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు భారీ భద్రత కోసం ఇప్పటికే పారామిలటరీ బలగాలతో సహా 50 వేల మంది సిబ్బంది ఆ ప్రాంతంలో మోహరించారు.